ఎంజీ విండ్సర్‌ ఇండల్జ్‌ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

ఎంజీ విండ్సర్‌ ఇండల్జ్‌ ఆవిష్కరణ

Oct 29 2026 2:18 AM | Updated on Oct 29 2026 2:18 AM

సాక్షి, చైన్నె : ఎలక్ట్రిక్‌ వాహనాలలో ఒకటిగా నిలిచిన ఎంజీ విండ్సర్‌ కొత్త శ్రేణి ఇండల్జ్‌ ఎడిషన్‌ ఆవిష్కరించారు.జెఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్‌ ఇండియా ఈ మోడల్‌ను రూ. 17,99,800 ప్రారంభ ధరతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. బిజినెస్‌–క్లాస్‌ ప్రయాణ అనుభవాన్ని మరింత విలాసవంతంగా మార్చేందుకు ప్రత్యేక ఫీచర్లతో ఈ కొత్త ఎడిషన్‌ను తీర్చిదిద్దారు. పవర్‌ట్రెయిన్‌ – మైలేజ్‌, బ్యాటరీ ప్యాక్‌ 38 కేడబ్ల్యు హెచ్‌ సామర్థ్యం, ఒక్కసారి పూర్తి ఛార్జింగ్‌ చేస్తే 332 కిలోమీటర్ల సర్టిఫైడ్‌ రేంజ్‌ లభించే రీతిలో రూపకల్పన చేశారు. వెనుక సీటు ప్రయాణికుల కోసం వినోదం, సౌకర్యాన్ని పెంచేందుకు ప్రత్యేక స్క్రీన్లను స్టాండర్డ్‌ ఫీచర్‌గా అందించారు.ఈసందర్భంగా జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్‌ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ వినయ్‌ రైనా మాట్లాడుతూ,వినియోగ దారుల ప్రాధాన్యతలకు అనుగుణంగా వాహనాన్ని కస్టమైజ్‌ చేసుకోవడానికి ప్రత్యేక యాక్సెసరీస్‌ ప్యాకేజీ అందుబాటులో ఉంటుందని వివరించారు. విండ్సర్‌ ఈవీ కేవలం తమ కంపెనీకే కాకుండా ఈవీ రంగానికి ఒక కీలకమైన మోడల్‌ అని ధీమా వ్యక్తంచేశారు. గడిచిన 24 నెలల కాలంలోనే 80,000 కంటే ఎక్కువ కుటుంబాలు విండ్సర్‌ను ఎంచుకోవడం గర్వకారణంగా పేర్కొన్నారు. ఈ విజయ స్ఫూర్తితోనే, వినియోగ దారులు అభిరుచులకు తగినట్లుగా డిజైన్‌ చేసిన ఇండల్జ్‌ ఎడిషన్‌ను తాజాగా తీసుకొచ్చామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement