వల్లిపురంలో ఐఐటీ మద్రాస్‌ ప్రాజెక్ట్‌ | - | Sakshi
Sakshi News home page

వల్లిపురంలో ఐఐటీ మద్రాస్‌ ప్రాజెక్ట్‌

Oct 29 2026 2:18 AM | Updated on Oct 29 2026 2:18 AM

– తాగునీరు, వ్యర్థాల నిర్వహణ వ్యవస్థల ప్రారంభం

సాక్షి, చైన్నె : చెంగల్పట్టు జిల్లా వల్లిపురం గ్రామ పంచాయతీలో ఐఐటీ మద్రాసు చేపట్టిన నీటి శుద్ధి, ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్ట్‌ విజయవంతంగా పూర్తయింది. ఐఐటీ మద్రాస్‌కు చెందిన జల నిర్వహణ , విధాన కేంద్రం ఆక్వామ్యాప్‌ ఆధ్వర్యంలో స్వచ్ఛమైన ,ఆరోగ్యకరమైన గ్రామ అభివృద్ధి కార్యక్రమం కింద ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేశారు. బుధవారం స్థానిక పంచాయతీ సముదాయానికి అధికారికంగా అప్పగించారు. ఈ ప్రాజెక్ట్‌కు సింగపూర్‌ నాన్యాంగ్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ ఆర్థిక సహాయం అందించింది. గ్రామంలోని పాఠశాలలు , ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని వికేంద్రీకృత తాగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేశారు. పాఠశాలల్లో అల్ట్రాఫిల్ట్రేషన్‌ , అల్ట్రావైలెట్‌ సిస్టమ్స్‌., ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆస్మోసిస్‌ , యూవీ సాంకేతికత ఏర్పాటు చేశారు. 5 నీటి ట్యాంకులు, శుద్ధి వ్యవస్థలపై ఆధారిత సెన్సార్లను అమర్చారు. ఇవి నీటి ప్రవాహం, విలువ, టర్బిడిటీ , టీడీఎస్‌ స్థాయిలను పర్యవేక్షించి మొబైల్‌ యాప్‌కు డేటాను పంపుతాయి. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా గ్రామంలోని 2 వేల మంది నివాసితులతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే పరిసర 14 గ్రామాల ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందుతోంది. అలాగే, సుస్థిర ఘన వ్యర్థాల నిర్వహణ, వ్యర్థాల సేకరణ కోసం బ్యాటరీతో నడిచే వాహనాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో వల్లిపురం పంచాయతీ అధ్యక్షురాలు సోబియా అముల్‌ పార్థసారథి ఐఐటీ మద్రాస్‌ ఆక్వామ్యాప్‌ సెంటర్‌కు చెందిన ప్రొఫెసర్‌ లిగీ ఫిలిప్‌ , ప్రొఫెసర్‌ బి.ఎస్‌. మూర్తి , చెంగల్పట్టు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement