– సరుకు రవాణా ద్వారా రూ.618.51 కోట్లు
సాక్షి, చైన్నె : దక్షిణ రైల్వేకు చెందిన చైన్నె డివిజన్ సరుకు రవాణా రంగంలో మరోసారి విశేష ప్రతిభ కనబరిచింది. ప్రస్తుత 2026–27 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు సరుకు రవాణా ద్వారా మొత్తం రూ.618.51 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంది. ఈ ఆరు నెలల వ్యవధిలో చైన్నె డివిజన్ నిత్యావసర వస్తువులు, విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించే బొగ్గు, వ్యవసాయ ఉత్పత్తులు, భారీ పారిశ్రామిక సరుకులతో సహా మొత్తం 5.413 మిలియన్ టన్నుల సరుకును విజయవంతంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా చేసింది. డివిజన్ మొత్తం ఆదాయంలో బొగ్గు రవాణాదే అగ్రస్థానంగా పేర్కొన్నా. 3.517 మిలియన్ టన్నుల బొగ్గును రవాణా చేయడం ద్వారా రూ.346.42 కోట్ల రాబడి లభించింది. ఇది మొత్తం సరుకు రవాణా ఆదాయంలో 56% , మొత్తం బరువులో 65% కావడం విశేషం. థర్మల్ విద్యుత్ కేంద్రాల ఇంధన అవసర తీర్చడంలో ఇది కీలక పాత్ర పోషించింది.ఇతర వస్తువులు – ఆటోమొబైల్స్‌లలో 0.662 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసి రూ.122.64 కోట్ల ఆదాయం సాధించారు. ఇందులో ఆటోమొబైల్ రంగం నుండి అత్యధికంగా 0.153 మిలియన్ టన్నుల వాహనాల రవాణాతో రూ 90.62 కోట్లు వచ్చాయి.


