అత్యవసర వైద్య సేవలకు నెస్ట్‌ విభాగం | - | Sakshi
Sakshi News home page

అత్యవసర వైద్య సేవలకు నెస్ట్‌ విభాగం

Oct 29 2026 2:18 AM | Updated on Oct 29 2026 2:18 AM

సాక్షి, చైన్నె : రామాపురంలో ఎస్‌ఆర్‌ఎం ప్రైమ్‌ హాస్పిటల్‌లో న్యూరోలాజికల్‌ అత్యవసర పరిస్థితులు, పక్షవాతం (స్ట్రోక్‌) బాధితులకు తక్షణ సమగ్ర వైద్యం అందించే లక్ష్యంతో న్యూరో ఎమర్జెన్సీ స్ట్రోక్‌ టీమ్‌ విభాగం ఏర్పాటు చేశారు. గురువారం ప్రపంచ స్ట్రోక్‌ దినోత్సవం సందర్భంగా ఈ అత్యాధునిక సేవలను ఒక రోజు ముందుగా బుధవారం నుంచి తీసుకొచ్చారు. అలాగే అత్యవసర బాధితుల కోసం ప్రత్యేక హాట్‌లైన్‌గా 044– 3500 3500 నంబర్‌నుప్రకటించారు. ఈ విభాగం ద్వారా ఒకే గొడుగు కింద అధునాతన వైద్య సదుపాయాలు, రోగ నిర్ధారణ నుండి రోగి పూర్తిగా కోలుకునే వరకు అవసరమయ్యే అత్యాధునిక మౌలిక వసతులను నెస్ట్‌ విభాగంలో కల్పించారు. ప్రత్యేక న్యూరో క్యాత్‌ ల్యాబ్‌ , ప్రత్యేక అత్యవసర సంరక్షణ పరికరాలు, 3డీ ఎంఆర్‌ఐ టెక్నాలజీ వంటి వసతులు ఏర్పాటు చేశారు. ఎస్‌ఆర్‌ఎం ప్రైమ్‌ సీఈఓ పి శివ, , న్యూరాలజీ సీనియర్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ సుబ్రమణియన్‌ కె, న్యూరో సర్జరీ డాక్టర్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌, డాక్టర్‌ స్వాతి టి, డాక్టర్‌ అక్షయ ఎస్‌, డాక్టర్‌ జి. కృష్ణ కుమార్‌, డాక్టర్‌ అరులాలన్‌ మదియలగన్‌ వంటి సీనియర్‌ వైద్య నిపుణులు ఈ కార్యక్రమానికి హజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement