రిజర్వాయర్లలో పెరిగిన నీటిమట్టం | - | Sakshi
Sakshi News home page

రిజర్వాయర్లలో పెరిగిన నీటిమట్టం

Oct 28 2026 1:12 AM | Updated on Oct 28 2026 1:12 AM

● 10 రోజులలో పెరిగిన 906 మిలియన్‌ క్యూబిక్‌ అడుగులు

సాక్షి, చైన్నె : ఈశాన్య రుతుపవనాలు ఊపందుకోవడంతో చైన్నె మహానగరానికి తాగునీటిని సరఫరా చేసే ప్రధాన జలాశయాల్లోకి వర్షపు నీరు భారీగా వచ్చి చేరుతోంది. గడిచిన 10 రోజులలోనే చైన్నె పరిసరాల్లోని 5 ముఖ్యమైన రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఏకంగా 906 మిలియన్‌ క్యూబిక్‌ అడుగులు పెరిగినట్లు జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. చైన్నె శివారులోని తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల్లో ఉన్న పూండి, పుళల్‌, చోళవరం, కన్నన్‌కొట్టై–తేర్వాయి కండిగై , చెంబరబాక్కం రిజర్వాయర్ల నుంచి చైన్నెకు శుద్దీకరించిన తాగునీరు అందిస్తున్న విషయం తెలిసిందే. నైరుతీ రుతు పవనాలు ముఖం చాటేయడంతో ఈ రిజర్వాయర్లలో నీరు అడుగంటాయి. తాజాగా ఈశాన్య రుతు పవనాల ప్రవేశంలో వర్షాలు ఆశాజనకంగా ఉన్నాయి. దీంతో ఈ రిజర్వాయర్లలోకి నీటి రాక పెరిగింది. నీటి ప్రవాహం నిలకడగా కొనసాగుతోండంతో తాజాగా పరిస్థితి గురించి . జలవనరుల శాఖ గణాంకాల తో రిజర్వాయర్లలో నీటి మట్టం గురించి ప్రకటించారు. పూండికి సెకనుకు 490 క్యూసెక్కులు, పుళల్‌కు సెకనుకు 210 క్యూసెక్కులు, చెంబరబాక్కంకు సెకనుకు 150 క్యూసెక్కులు, కన్నన్‌కొట్టై–తేర్వాయి కండిగై కు సెకనుకు 50 క్యూసెక్కులు, చోళవరంకకు సెకనుకు 10 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.

నీటి నిల్వల ప్రస్తుత పరిమాణం

చెంబరబాక్కం సామర్థ్యం 3,645 మిలియన్‌ క్యూబిక్‌ కాగా, ప్రస్తుతం 1,488 మిలియన్‌ క్యూబిక్‌ నీళ్లు ఉంది. పుళల్‌ సామర్థ్యం 3,300 కాగా, 2,415 మిలియన్‌ క్యూబిక్‌, పూండి సామర్థ్యం 3,231 కాగా 565 మిలియన్‌ క్యూబిక్‌, చోళవరం సామర్థ్యం 1,081 కాగా, 144 మిలియన్‌ క్యూబిక్‌, కన్నన్‌కొట్టై–తేర్వాయి కండిగై సామర్థ్యం 500 కాగా, 253 మిలియన్‌ క్యూబిక్‌ నీళ్లు ఉన్నాయి. ఈ రిజర్వాయర్లలో మొత్తం నీటి నిల్వ శాతం 11,757 మిలియన్‌ క్యూబిక్‌గా ఉండగా, ప్రస్తుతం 4,865గా కొనసాగుతున్నది. చైన్నె తాగునీటి అవసరాలు తీర్చే ఈ ఐదు రిజర్వాయర్లలో ఈనెల 15వ తేదీ ఉదయానికి కేవలం 3,959 మిలియన్‌ క్యూబిక్‌ అడుగుల నీరు మాత్రమే ఉండగా, వరుస వర్షాల కారణంగా సోమవారం రాత్రికి ఆ సంఖ్య 4,865 మిలియన్‌ క్యూబిక్‌ అడుగులకు చేరింది. ఈవిధంగా కేవలం పది రోజుల్లోనే 906 మిలియన్‌ క్యూబిక్‌ అడుగుల నీరు అదనంగా చేరడంతో రాబోయే రోజుల్లో చైన్నె నగరానికి తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఉంటుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అర్నాబ్‌ తుపాన్‌ ఆంధ్రా వైపుగా వెళ్లిన నేపథ్యంలో ఈశాన్య రుతు పవనాలు మంగళవారం కాస్త విరామం తీసుకున్నట్లయ్యింది. ఈ తుపాన్‌ తీరం దాటినానంతరం నవంబర్‌ 1 లేదా 2వ తేదీల నుంచి చైన్నె, శివారులలో మళ్లీ వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ దృష్ట్యా రానున్న రోజులలో రిజర్వాయర్లలో నీటిమట్టం మరింతగా పెరగవచ్చని అధికారులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement