న్యాయవాద వృత్తిలో మహిళలకు పట్టం | - | Sakshi
Sakshi News home page

న్యాయవాద వృత్తిలో మహిళలకు పట్టం

Oct 28 2026 1:12 AM | Updated on Oct 28 2026 1:12 AM

సాక్షి, చైన్నె : లింగ సమానత్వాన్ని ప్రోత్సహిస్తూ , న్యాయ వృత్తి రంగంలో మహిళా నాయకత్వాన్ని చాటిచెబుతూ , వారికి పట్టం కట్టే విధంగా ఎస్‌ఆర్‌ఎం స్కూల్‌ ఆఫ్‌ లాలో కార్యక్రమం జరిగింది. 8వ జాతీయ స్థాయి తమిళ మూట్‌ కోర్ట్‌ పోటీ 2026 పేరిట అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ న్యాయ కళాశాలల నుంచి 42 జట్లకు చెందిన 126 మంది అభ్యర్థులు తమిళంలో తమ వాదనాపటిమను ప్రదర్శించారు. ఈ పోటీలలో, ధర్మపురి ప్రభుత్వ న్యాయ కళాశాల విజేతగా నిలిచి అగ్రస్థానాన్ని కై వసం చేసుకుంది. ఈ జాతీయ పోటీల తుది రౌండ్‌కు ఐదుగురు ప్రముఖ మహిళా న్యాయ నిపుణుల బృందం న్యాయనిర్ణేతలుగా వ్యవహరించడం విశేషం. ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యం 5కి అనుగుణంగా న్యాయ రంగంలో మహిళా ప్రాతినిధ్యాన్ని చాటిచెప్పడమే లక్ష్యంగా ఈ ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. తుది రౌండ్‌ న్యాయనిర్ణేతలుగాజస్టిస్‌ ప్రభా శ్రీదేవన్‌ (మద్రాసు హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి), ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎన్‌. కయల్విళి (ప్రిన్సిపల్‌, డాక్టర్‌ అంబేద్కర్‌ ప్రభుత్వ న్యాయ కళాశాల), ప్రొఫెసర్‌ డాక్టర్‌ జయ గౌరి (ప్రిన్సిపాల్‌, డాక్టర్‌ అంబేద్కర్‌ ప్రభుత్వ న్యాయ కళాశాల), అడ్వకేట్‌ గీత (సీనియర్‌ న్యాయవాది, మద్రా సు హైకోర్టు), అడ్వకేట్‌ జి.వి. శోభ (సీనియర్‌ న్యాయవాది, మద్రాసు హైకోర్టు) వ్యవహరించారు.

విజేతలు – పురస్కారాలు

విజేత గా ధర్మపురి ప్రభుత్వ న్యాయ కళాశాల, ఽరన్నరప్‌గా మదర్‌ థెరిసా న్యాయ కళాశాల, ఉత్తమ స్మారక చిహ్నం – ఉత్తమ పరిశోధకుడి పురస్కారాన్ని కారైక్కుడి ప్రభుత్వ న్యాయ కళాశాల దక్కించుకున్నాయి. ఉత్తమ వక్తగా తిరునల్వేలి ప్రభుత్వ న్యాయ కళాశాల నిలిచింది. మస్రు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌. మాలవిజేతలకు పురస్కారాలను, బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ భవానీ సుబ్బరాయన్‌, ఎస్‌ఆర్‌ఎం స్కూల్‌ ఆఫ్‌ లా ప్రతినిధులు, న్యాయ విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement