అన్బిల్‌ మహేష్‌ అరెస్ట్‌ హైడ్రామా | - | Sakshi
Sakshi News home page

అన్బిల్‌ మహేష్‌ అరెస్ట్‌ హైడ్రామా

Oct 28 2026 1:00 AM | Updated on Oct 28 2026 1:00 AM

● పుళల్‌ జైలుకు తరలింపు ● అర్ధరాత్రి వరకు వాదనలు

సాక్షి,చైన్నె: ప్రైవేట్‌ పాఠశాలల నిధుల మళ్లింపు, రూ. 100 కోట్ల ఆర్థిక అవకతవకల కేసుకు సంబంధించి మాజీ పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేష్‌ను చైన్నె సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు హైడ్రామా నడుమ సోమవారం అర్థరాత్రి సమయంలో అధికారికంగా అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి అర్ధరాత్రి వరకు కోర్టులో తీవ్ర వాదనలు జరగగా, చివరికి ఆయనను తదుపరి ఆయన్ను రిమాండ్‌ నిమిత్తం పుళల్‌ జైలుకు తరలించారు. వివరాలు.. ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు,గుర్తింపు పేరిట రూ. 100 కోట్ల వరకు అక్రమాలు జరిగినట్టుగా వచ్చిన ఆరోపణలతో అన్బిల్‌ మహేష్‌ను సోమవారం అదుపులోకి క్రైం బ్రాంచ్‌ వర్గాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఎలాంటి ఆధారాలు లేకుండా రూ. 400 కోట్ల వరకు వసూలు చేశారనే అభియోగాలపై సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం చర్చకు దారితీసింది.ఈ దర్యాప్తులో భాగంగా పోలీసులు అన్బిల్‌ మహేష్‌ను అదుపులోకి తీసుకుని, వైద్య పరీక్షల నిమిత్తం రాజీవ్‌ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి రాత్రి సమయంలో తరలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి, కమిషనర్‌ కార్యాలయం వద్ద గుమిగూడిన డీఎంకే కార్యకర్తలు పోలీసు వాహనాలను అడ్డుకుని పెద్దపెద్దగా నినాదాలు చేశారు.

కోర్టులో అర్ధరాత్రి ఉత్కంఠ వాదనలు

అరెస్టు అనంతరం అన్బిల్‌ మహేష్‌ను చైన్నె హైకోర్టులోని అవినీతి నిరోధక ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. రాత్రి 10 గంటల నుండి 12 గంటల వరకు సుమారు రెండు గంటల పాటు ఇరువర్గాల మధ్య వాడివేడి వాదనలు జగాయి. అరెస్టు ప్రక్రియ చట్టబద్ధ నిబంధనలను పాటించకుండా జరిగిందని, ఇప్పటికే ఆయనను ప్రశ్నించినందున జైలుకు పంపాల్సిన అవసరం లేదని డీఎంకే తరఫు న్యాయవాదులు వాదించారు. ప్రభుత్వ లాయర్ల వాదిస్తూ, ఆర్థిక దుర్వినియోగానికి సంబంధించిన బలమైన ఆధారాలు ఉన్నాయని, తదుపరి విచారణ కోసం నిందితుడిని కస్టడీకి అప్పగించాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి సత్యమూర్తి, అన్బిల్‌ మహేష్‌ను నవంబర్‌ 6వ తేదీ వరకు రిమాండ్‌ విధిస్తూ ఆదేశించారు.

పుజల్‌ జైలుకు తరలింపు

– రాజకీయ దుమారం

కోర్టు ఆదేశాల మేరకు అర్థరాత్రి సుమారు 12.30 గంటల ప్రాంతంలో పోలీసులు అన్బిల్‌ మహేష్‌ను భారీ భద్రత మధ్య పళల్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు. మార్గ మధ్యలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.ఈ అరెస్టుపై డీఎంకే నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఇది పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్య అని, ప్రభుత్వ అణచివేత ధోరణిని చట్టపరంగా ఎదుర్కొంటామని డీఎంకే నాయకుడు పి.కె. శేఖర్‌బాబు, ప్రధాన ప్రతి పక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. అదే సమయంలో పలు చోట్ల అర్థరాత్రి వేళ ఆందోళనలు జరిగాయి. అన్బిల్‌ మహేష్‌ సొంత జిల్లాలో ఆందోళనలు రాజుకోవడంతో పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement