విద్యుత్‌ బిల్లుల మంట | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ బిల్లుల మంట

Oct 28 2026 1:00 AM | Updated on Oct 28 2026 1:00 AM

– ఛార్జీలపై మద్రాస్‌ హైకోర్టులో పిల్‌

సాక్షి, చైన్నె: రాష్ట్రవంలో విద్యుత్‌ బిల్లులు ఊహించని రీతిలో రెండు నుంచి మూడు రెట్లు పెరగడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. అదనపు విద్యుత్‌ ఛార్జీల విధింపుపై విచారణ జరిపేందుకు వెంటనే ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.చైన్నె తిరువెర్‌ కోట్టంకు చెందిన కా మేష్‌ దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో పలు కీలక విషయాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత విద్యుత్‌ పరిమితిని 100 యూనిట్ల నుండి 200 యూనిట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుందని వివరించారు. అయితే, ఈ ఉత్తర్వులు జారీ అయినప్పటి నుండి గత ఒకటిన్నర నెలలుగా విద్యుత్‌ బిల్లులు మునుపటి కంటే 2 నుండి 3 రెట్లు ఎక్కువగా వస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. గతంలో రూ. 2,000 వచ్చే బిల్లు ప్రస్తుతం ఏకంగా రూ. 4,000 నుండి రూ. 5,000 వరకు వస్తోందని, దీనివల్ల సామాన్య ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాగా అధిక బిల్లులపై ఇప్పటికే లక్షన్నరకు పైగా ప్రజలు ఫిర్యాదులు చేసినప్పటికీ, విద్యుత్‌ బోర్డు ఎలాంటి చర్యలు తీసుకోకుండా అధిక ఛార్జీల వసూలును కొనసాగిస్తోందని ఆరోపించారు.విద్యుత్‌ టారిఫ్‌ నిర్ధారణలో ఉన్న లోపాలను విచారించడానికి ప్రత్యేక కమిటీని నియమించాలని , పాత టారిఫ్‌ విధానాన్నే అమలు చేయాలని పిటిషనర్‌ విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి పి.డి. ఆశా, ఇది తీవ్ర ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన విషయమని పేర్కొన్నారు. ఈ కేసును తదుపరి విచారణ నిమిత్తం ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనానికి బదిలీ చేయాలని కోర్టు రిజిస్ట్రేషన్‌ విభాగాన్ని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement