ఎముక మజ్జ మార్పిడిలో సరికొత్త పురోగతి | - | Sakshi
Sakshi News home page

ఎముక మజ్జ మార్పిడిలో సరికొత్త పురోగతి

Oct 28 2026 1:00 AM | Updated on Oct 28 2026 1:00 AM

● విజయవంతంగా హెచ్‌కాన్‌ 2026

సాక్షి, చైన్నె: చైన్నెలోని ఎంజీఎం క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆధ్వర్యంలో ఎముక మజ్జ మార్పిడి, సెల్యులార్‌ థెరపీలలో వచ్చిన ఆధునిక పరిణామాలపై హెచ్‌కాన్‌ 2026 పేరిట రెండు రోజుల సదస్సును విజయవంతంగా నిర్వహించారు. ఇందులో 150 మందికి పైగా వైద్య నిపుణులు, పరిశోధకులు , ప్రతినిధులు పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు.అధునిక చికిత్సా పద్ధతులపై చర్చించారు. పెద్దలు , పిల్లలలో వచ్చే రక్త సంబంధిత రుగ్మతలు హెమటాలజికల్‌ ఆంకాలజీ, విప్లవాత్మక సీఏ ఆర్‌టీ – సెల్‌ థెరపీ వంటి సెల్యులార్‌ థెరపీలలో జరుగుతున్న పరిశోధనలు, క్లినికల్‌ పురోగతిపై విస్తృతంగా చర్చించి నిర్ణయాలు తీసుకన్నారు.గడిచిన రెండేళ్ల వ్యవధిలోనే ఎంజీఎం క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ విజయవంతంగా 100 ఎముక మజ్జ మార్పిడి ప్రక్రియలను పూర్తి చేసి ఒక విలక్షణమైన సంస్థాగత మైలురాయిని చేరుకుందని ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రకటించారు. కార్యక్రమంలో ఎంజీఎం హెచ్‌ కాన్‌ నిర్వాహక కార్యదర్శి డాక్టర్‌ గోపీనాథన్‌, హెమటాలజీ గ్రూప్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ఎం.బి. అగర్వాల్‌, హెమటాలజీ పీడియా ట్రిక్‌ విభాగాధిపతి డాక్టర్‌ దీనదయాళన్‌, ఎంజీఎం క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ సీఓఓ శరవణ కుమార్‌ రాజన్‌ తదితరులు పాల్గొన్నారు.

సదస్సులో వైద్య నిపుణులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement