వరల్డ్‌స్కిల్స్‌ పోటీల విజేతలకు సీఎం ప్రోత్సాహం | - | Sakshi
Sakshi News home page

వరల్డ్‌స్కిల్స్‌ పోటీల విజేతలకు సీఎం ప్రోత్సాహం

Oct 28 2026 1:00 AM | Updated on Oct 28 2026 1:00 AM

● పతక విజేతలకు రూ. 49 లక్షల పంపిణీ

సాక్షి, చైన్నె : చైనాలోని షాంఘై నగరం వేదికగా నిర్వహించిన ప్రతిష్టాత్మక 48వ ప్రపంచ నైపుణ్యాల పోటీలలో భారత్‌ తరఫున పాల్గొని పతకాలు, పురస్కారాలు సాధించిన తమిళనాడు యువతను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. పతక విజేతలతో పాటు పోటీల్లో పాల్గొన్న మొత్తం 12 మంది తమిళనాడు ప్రతినిధులకు సచివాలయంలో రూ. 49 లక్షల విలువైన ప్రోత్సాహక చెక్కులను సీఎం విజయ్‌ అందజేసి అభినందించారు. ప్రపంచవ్యాప్తంగా 68 దేశాల భాగస్వామ్యంతో 63 విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించారు. 70 మంది సభ్యులతో కూడిన భారత జట్టు 10వ ర్యాంకును సాధించగా, అందులో తమిళనాడుకు చెందిన 12 మంది ప్రతినిధులు భారతదేశం తరఫున ప్రాతినిథ్యం వహించారు. వీరిలో ఐదుగురు అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి ఖ్యాతి తెచ్చిపెట్టారు. రజత పతక విజేత డెంటల్‌ ప్రోస్థెటిక్స్‌ విభాగంకు చెందిన మహ్మద్‌ సలాంకు రూ. 15 లక్షలు , ప్రత్యేక పతకాల విజేతలు కె.పి. రాహుల్‌ (ఇంటెలిజెంట్‌ సెక్యూరిటీ టెక్నాలజీ),.వి. అర్జున్‌ (మొబైల్‌ అప్లికేషనన్స్‌ డెవలప్‌మెంట్‌), ఎం. సురేంద్రన్‌ (ప్లాస్టరింగ్‌ అండ్‌ డ్రైవాల్‌ సిస్టమ్స్‌), జాయ్‌ దాస్‌ (ఆభరణాల తయారీ)లకు తలా రూ. 5 లక్షలు అందజేశారు. పోటీలో పాల్గొన్న ఏడుగురు కె.ఎం. సురేష్‌ కుమార్‌, కె. గోకులకన్నన్‌, పి.ఆర్‌. మహమ్మద్‌ మబాజ్‌, ఎస్‌. అశ్విన్‌, టి. రోహిత్‌, తనుశ్రీ మహేష్‌, ఎ. మోహన్‌రాజ్‌లకు తలా రూ. 2 లక్షలను అందజేశారు.

యువత ముందుకు రావాలని పిలుపు

పాఠశాలలు, ఆర్ట్స్‌, ఇంజనీరింగ్‌, పాలిటెక్నిక్‌ , పారామెడికల్‌ కళాశాలల్లో చదువుతున్న 16 నుండి 23 సంవత్సరాల వయస్సు గల యువత ఈ నైపుణ్య పోటీలలో విస్తృతంగా పాల్గొనాలని ప్రభుత్వం పిలుపు నిచ్చింది. ఈ పోటీలపై అవగాహన పెంచుకోవడానికి తమిళనాడు నైపుణ్యాభివృద్ధి సంస్థ హెల్ప్‌లైన్‌ నంబర్లు (9962220527, 9962220528) లేదా అధికారిక వెబ్‌సైట్‌ ww-w.rkideveopment.tn.gov.in/tnr-ki r/ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చని వెల్లడించారు. ఈ సత్కార కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఎం. సాయికుమార్‌ ఇతర అఽధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement