తమిళసినిమా: రామే ఆండాలుమ్ రావణే ఆండాలుమ్ చిత్రం ద్వారా నటుడు సూర్య పరిచయం చేసిన నటుడు, దర్శకుడు మాథున్ మాణిక్యం. కాగా ఈయన తాజాగా కథానాయకుడిగా నటిస్తూ సీయ దర్శకత్వంలో తెరకెకిస్తున్న చిత్రం ఫ్యామిలీ బాయ్. ఎం. సుకుమార్, చరణ్ సుధాకర్, అనుగ్రహ ఎస్. నంబియార్, నిఖిలా శంకర్, అనిత సంపత్, పసంగ శివకుమార్, శివం, అరుళ్ దాస్ ,పీఎల్.తేనప్పన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం దర్శకుడు మిథున్ మాణిక్యంకు చెందిన మెకానిక్ పిక్చర్స్ సంస్థ, కణి బైసల్ ,డాక్టర్ కె అరుణ్ ఆరుముగంకు చెందిన మిల్లినీయల్స్ మూవీ ఎల్ఎల్పీ, మిల్లీనియల్స్ మూవీ సంస్థలు నిర్మిస్తున్నాయి. షూటింగ్ కాకినాడ పురుచేస్తున్న ఈ చిత్ర టీజర్‌ను చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మిథున్ మాణిక్యం చిత్ర వివరాలను మీడియాకు విడుదల చేసిన పేటలో పేర్కొంటూ ఇది తమిళనాడులో ఓ కుటుంబంలో జరిగిన ఒక యదార్థ ఘటన ఆధారంగా రూపొందిస్తున్న ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, త్రిల్లర్ కథా చిత్రం అని పేర్కొన్నారు. చిదంబరంలో మొదలై సింగార చైన్నె వరకు కోల్పోయిన ఒక వస్తువు వెతుక్కుంటూ వచ్చే యువకుడికి ఒక్క రోజులో ౠదురైయ్యే సంఘటనలు, సమస్యలతో రూపొందిన చిత్రం టీజర్ కు ప్రచారం నుంచి మంచి స్పందన వస్తుందని పేర్కొన్నారు. చిత్ర కథ, కథనాలు, సంగీతం మొదలగు అన్ని అంశాలు ప్రేక్షకులను అలసిస్తాయనిమే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. చిత్రాన్ని డిసెంబర్ 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కాగా బలూన్ పిక్చర్స్ సంస్థ దీన్ని తమిళనాడులో సమర్పిస్తోందని దర్శకుడు చెప్పారు.


