త్వరలో తెరపైకి ‘వేట్టైసామి’ | - | Sakshi
Sakshi News home page

త్వరలో తెరపైకి ‘వేట్టైసామి’

Oct 28 2026 1:00 AM | Updated on Oct 28 2026 1:00 AM

తమిళసినిమా: నటుడు అరుళ్‌ నిధి, దర్శకుడు అమీర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం వేట్టైసామి. బంపర్‌ చిత్రం ఫేమ్‌ ఎం సెల్వకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటుడు ఆడుగళం నరేన్‌, మధుసూదన్‌ రావ్‌, హరీష్‌ పేరడీ, లిజీ చంద్రశేఖర్‌, ఇందుమతి మణికంఠన్‌, మైనా నందిని, దర్శకుడు తమిళ్‌, కవిత భారతి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. సెవెన్‌ మైల్స్‌ ఫర్‌ సెకండ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సామ్యువేల్‌ మ్యాథ్యూ నిర్మించిన ఈ చిత్రానికి జిప్రాన్‌ సంగీతాన్ని, ఆర్డీ.రాజశేఖర్‌ ఛాయాగ్రహణం అందించారు. నైల్లె నేపథ్యంలో రూపొందిన మంచి భావోద్వేగాలతో కూడిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కథా చిత్రం వేట్టై సామి అని నిర్మాత తన ఎక్స్‌ మీడియాలో పేర్కొన్నారు. చిత్ర పోస్టర్‌ను అందులో పొందుపరిచి ఇది చట్టం నుంచి బయటపడి భగవంతుని ఎదుర్కొనడానికి సిద్ధమైంది అని పేర్కొన్నారు. చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్‌ నెలలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. కాగా చిత్ర పోస్టర్‌ను చూస్తుంటే ఇదేదో విప్లవాత్మక అంశాలతో కూడిన కథాచిత్రం అని అనిపిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా ఇటీవల సరైన సక్సెస్‌ లేని నటుడు అరుళ్‌ నిధికి కెరీర్‌కు ఈ వేట్టైసామి చిత్రం ఏ మేరకు ప్లస్‌ అవుతుందో చూడాల్సి ఉంది.

వేట్టై సామి చిత్రంలో అరుళ్‌ నిధి, అమీర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement