తమిళసినిమా: ప్రయత్నిస్తే అసాధ్యమేదీ కాదు. నిరంతర కృషి ,పట్టుదలతో అనుకున్నది సాధించిన వారు చాలామంది ఉన్నారు. నటి నమితను కూడా ఈ కోవాలోకి చేర్చవచ్చు. సుమారు రెండు దశాబ్దాల క్రితం ఈమె అంటే కురక్రారు గుండెల్లో గుబులు పుట్టేది. నమిత మచ్చాస్ అని అంటేచాలు అభిమానులు ఈలలు, చప్పట్లతో కేరింతలు కొట్టేవారు. 2001 ప్రాంతంలో కథానాయకగా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తెలుగు, తమిళం మలయాళం, కన్నడ భాషల్లో నటించి క్రేజీ కథానాయకగా పేరు తెచ్చుకున్నారు. అలా అన్ని రకాల పాత్రలు పోషించిన నమిత గ్లామరస్ పాత్రలోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. అలాంటి సమయంలో వీరేంద్ర చౌదరి అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత కారణాలు ఏమైనా భారీగా బరువు పెరిగారు. దీంతో అవకాశాలు దూరం అవుతూ వచ్చాయి అలాంటి పరిస్థితుల్లో నమిత రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీలో యాక్టివ్‌గా ఉంటున్నారు. అయితే తరచూ తన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ లైవ్‌లో ఉండే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా నటి నమిత ప్రముఖ యూట్యూబర్ డీజే సిద్దు దర్శకత్వం వహిస్తున్న డయంకరం అనే చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా భారీగా బరువు పెరిగిన నమిత వయసు 44 ఏళ్లు. అయితే ఇప్పుడు ఈ భామను చూస్తుంటే 20 ఏళ్ల అందగత్తెగా కనిపిస్తున్నారు. అంతగా బరువు తగ్గి స్లిమ్‌గా కనిపిస్తున్నారు. అలా ఆమె జిమ్ములో కసరత్తులు చేస్తున్న ఒక వీడియోను తాజాగా తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో ను నెటిజన్లు నమిత నేనా అని ఆశ్చర్యపోతున్నారు. నమిత కమ్ బ్యాక్ అంటూ పోస్టులు కూడా పెడుతున్నారు.


