మహిళలు రొమ్ము క్యాన్సర్‌పై అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

మహిళలు రొమ్ము క్యాన్సర్‌పై అప్రమత్తంగా ఉండాలి

Oct 28 2026 1:00 AM | Updated on Oct 28 2026 1:00 AM

వేలూరు: మహిళలు తరచూ రొమ్ము క్యాన్సర్‌పై వైద్య పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్‌ లీల అలెక్స్‌ అన్నారు. వేలూరు కలెక్టరేట్‌ ఆవరణంలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ, వైద్య ఆరోగ్యశాఖ సంయుక్తంగా మహిళలకు బ్రస్ట్‌ క్యాన్సర్‌పై ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని కలెక్టర్‌ ప్రారంభించి పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ మహిళలు తరచూ తమ పిల్లలు, భర్త, అత్త మామల సంక్షేమానికి ప్రాదాన్యత ఇస్తూ వారి సొంత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారన్నారు. ఒక నిర్థిష్ట వయస్సు దాటిన మహిళలు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలన్నారు. ఇటీవల అధికగా మహిళలకు రొమ్ము క్యాన్సర్‌ అధికంగా వస్తున్నాయని వాటిని ఆలస్యంగా గుర్తిస్తే ప్రమాదకరమన్నారు. ప్రస్తుతం వైద్య పరీక్షలు చేసుకున్న మహిళలే కాకుండా అంగన్‌వాడీ టీచర్‌లు,స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు మీ ప్రాంతంలోని మహిళలకు వీటిపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్‌ సురేష్‌, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ శివకుమార్‌, రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ ఉదయశంకర్‌, కార్యదర్శి పర్వదం, కోశాధికారి ఆడిటర్‌ పాండియన్‌, స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు, అంగన్‌వాడీ టీచర్‌లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement