రూ. 634 కోట్ల రిక్రూట్‌మెంట్‌ స్కామ్‌ | - | Sakshi
Sakshi News home page

రూ. 634 కోట్ల రిక్రూట్‌మెంట్‌ స్కామ్‌

Oct 27 2026 1:56 AM | Updated on Oct 27 2026 1:56 AM

● మాజీ మంత్రి కె.ఎన్‌. నెహ్రూకు హైకోర్టులో భారీ షాక్‌

సాక్షి, చైన్నె: పురపాలక శాఖ నియామకాల్లో జరిగిన భారీ అవకతవకల వ్యవహారంలో డీఎంకే మాజీ మంత్రి కె.ఎన్‌. నెహ్రూకు మద్రాస్‌ హైకోర్టులో తీవ్ర షాక్‌ ఎదురైంది. తనపై అవినీతి నిరోధక శాఖ (డీవీఏసీ ) కేసు నమోదు చేయాలని గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సమీక్షించాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. వివరాలు.. గత డీఎంకే ప్రభుత్వ హయాంలో పురపాలక పరిపాలన శాఖలో 2,538 సహాయ ఇంజనీర్లు , జూనియర్‌ ఇంజనీర్ల నియామకాల్లో రూ. 634 కోట్ల మేర లంచాలు స్వీకరించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నియామకాల అక్రమాలపై ఆధారాలతో కూడిన సమాచారాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తమిళనాడు డీజీపీకి లేఖ రూపంలో పంపింది. దీని ఆధారంగా అన్నాడీఎంకే ఎంపీ ఇన్బదురై దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు, తక్షణమే డీవీఏసీ కేసు నమోదు చేయాలని గత ఫిబ్రవరిలో ఆదేశించింది.

హైకోర్టు కీలక తీర్పు:

తన వాదనలు వినకుండానే కేసు నమోదుకు ఆదేశాలు ఇచ్చారని, ఇది తన హక్కుల ఉల్లంఘన అని పేర్కొంటూ మాజీ మంత్రి కె.ఎన్‌. నెహ్రూ రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి సుశ్రుత్‌ అరవింద్‌ ధర్మాధికారి, జస్టిస్‌ జి. అరుల్‌ మురుగన్లతో కూడిన ధర్మాసనం వాదనలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం కె.ఎన్‌. నెహ్రూ దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో ఆయనపై కేసు నమోదు , విచారణ ప్రక్రియ వేగవంతం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement