తిరువళ్లూరు: గ్రీవెన్స్డేకు వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ కవిత అధికారులను ఆదేశించారు. తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ కార్లాయయంలో సోమవారం ఉదయం పది గంటల నుంచి రెండు గంటల వరకు గ్రీవెన్స్డేను నిర్వహించారు. ఈ గ్రీవెన్స్డేకు అన్ని శాఖలకు చెందిన అధికారులు హాజరుకాగా, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. పట్టా కోసం 65 వినతులు, ఎస్సీ ఎస్టీ శాఖకు చెందిన 36 వినతులు, ఉపాధి కోసం 27 వినతులు, మౌలిక సదుపాయాలు కల్పించాలని 28 వినతులతో పాటు మొత్తం 480 వినతులు వచ్చినట్టు కలెక్టర్ కవిత వివరించారు. అనంతరం 2026 సీఎం కప్ పోటీల్లో పాల్గొని విజయం సాధించిన 54.36 లక్షల రూపాయల బహుమతులు, వికలాంగులకు సహాయకాలకు అందజేశారు.


