క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Oct 27 2026 1:50 AM | Updated on Oct 27 2026 1:50 AM

బాలిక అదృశ్యం కేసు సీబీసీఐడీకి..

కొరుక్కుపేట: సెంజి సమీపంలోని అలంపూండిలో 12వ తేదీన హేమలత అనే 7 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. ఈ విషయమై సత్యమంగళం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అంతేకాకుండా, అదృశ్యమైన బాలిక ఆచూకీ కోసం 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ పరిస్థితిలో, కేసును సి.బి.సి.ఐ.డికి బదిలీ చేశా రు. ప్రస్తుతం, సి.బి.సి.ఐ.డి డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ గీత నాయకత్వంలో పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఆమె నాయకత్వంలో 4 ప్రత్యేక బృందాలు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయి. ఓ బృందం సెల్‌ఫోన్‌ టవర్లను, మరో బృందం నిఘా కెమెరాలను దర్యాప్తు చేస్తుండగా, ఇంకో బృందం అలంపూండి గ్రామంలో మకాం వేసి బాలిక బంధువులను విచారిస్తోంది. మరో బృందం బాలిక తల్లిదండ్రులను కూడా విచారిస్తోంది. ఈ పరిస్థితిలో ఈ కేసు లో అదనంగా ఒక డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ను నియమించారు. దీని ప్రకారం, ఈ కేసు దర్యాప్తు కోసం కాంచీపురం సీబీసీఐడీ డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ వేల్మురుగనన్‌ను నియమించారు. ఆయన ఈ ఉదయం సత్యమంగళం పోలీస్‌ స్టేషనన్‌కు చేరుకుని తన పనిని ప్రారంభించారు. ఆయన అక్కడి అధికారులతో సంప్రదించి కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు.

బంగారు కేడెముపై

కొలువైన వాసవీ అమ్మవారు

కొరుక్కుపేట: బంగారు కేడెముపై శ్రీ వాసవీ అమ్మవారు కొలువై భక్తులను కటాక్షించారు. చైన్నె లోని 300 సంవత్స రాల చరిత్ర కలిగిన శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో ఈనెల 22 నుంచి వడాయతి ఉత్స వాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. అందులో భాగంగా సోమవారం శ్రీ వాసవీ అమ్మవారిని బంగారు కేడెముపై విశేషంగా అలంకరించి పూజ లు చేశారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తరించారు. ఈ ఉత్సవంలో సాయంత్రం జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో టీబీ జనని వీణా వాయిద్య కచ్చేరితో అందరినీ మంత్రముగ్ధులను చేసింది.

మంత్రి రాజమోహన్‌పై

ప్రశంసల జల్లు

కొరుక్కుపేట: ఎగ్మోర్‌ శాసనసభ సభ్యుడు, పాఠశాల విద్యాశాఖ మంత్రి ఎ. రాజ్‌ మోహన్‌ కార్యాలయాన్ని మంత్రి ఎన్‌. ఆనంద్‌ కార్యాలయాన్ని ప్రారంభించి ప్రజలకు భోజనం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హౌసింగ్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ శివ, టెక్స్‌ట్‌బుక్‌ సొసైటీ ఛైర్మన్‌ లయో లా ఎస్‌.కె.ఎం. మణి, జిల్లా కార్యదర్శి కుమార్‌, మాజీ ఎంపీ బాల గంగ తదితరులు హాజర య్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎన్‌ ఆనంద్‌ మాట్లాడుతూ పేదల కోసం అవసరమైన సహాయం అందించేందుకు ముఖ్యమంత్రి విజయ్‌ రాజ్‌మోహన్‌కు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించడం జరిగిందన్నారు. మంత్రి రాజ్‌మోహన్‌ విద్యా రంగాన్ని ఎన్నో ఏళ్లుగా చూడని స్థాయిలో అవినీతి రహిత రంగంగా మార్చారు. ప్రజలు, విద్యార్థులు చాలా సంతోషంగా ఉన్నారు. టీవీకేకు లభించిన అతిపెద్ద వరం మంత్రి రాజ్‌మోహన్‌. ఆయనకు తాను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను అని ప్రశంసించారు. ప్రజలకు సేవ చేసేందుకు మేమందరం ముఖ్యమంత్రితో కలి సి పనిచేస్తాం అని ఆయన స్పష్టం చేశారు.

నెట్‌ఫ్లిక్స్‌ – హోయిచోయ్‌ మధ్య ఒప్పందం

సాక్షి,చైన్నె: ఓటీటీ రంగంలో ప్రముఖ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ హోయిచోయ్‌, డిజిటల్‌ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లు భారీ భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. ప్రేక్షకులకు అత్యుత్తమ కథలు, కొత్త ప్రీమియర్‌ లు, రీమేక్‌లను అందించడమే లక్ష్యంగా ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లు చేతులు కలిపాయి. ఈ భాగ స్వామ్యం ద్వారా రాబోయే రెండేళ్లలో విడుదల కానున్న హోయిచోయ్‌ ఒరిజినల్‌ సిరీస్‌లు బెంగాలీతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రత్యేకంగా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రాను న్నాయి. క్రైమ్‌ థ్రిల్లర్లు, డిటెక్టివ్‌ మిస్టరీలు, జానపద హారర్‌, కోర్టురూమ్‌ డ్రామాలు, రొమాంటిక్‌ డ్రామాలు సహా మొత్తం 14 ప్రశంసలు పొందిన సిరీస్‌లు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానున్నాయి. ఈ భాగ స్వామ్యంలో భాగంగా వస్తున్న మొదటి కొత్త డబ్బింగ్‌ విడుదలగా ది కర్స్డ్‌ టెంపుల్‌ ఆఫ్‌ కౌరిబురి అనే జానపద హారర్‌ సిరీస్‌ నవంబర్‌ 6న నెట్‌ఫ్లిక్స్‌లో రానున్నట్టు ప్రకటించారు.

కళాశాల విద్యార్థి హత్య

– మురుగునీటి వివాదంలో దారుణం

అన్నానగర్‌: శ్రీవైకుంఠం సమీపంలో మురుగునీటి కాలుష్యం కారణంగా కళశాల విద్యార్థి దారు ణ హత్యకు గురయ్యాడు. తూత్తుకుడి జిల్లా శ్రీవైకుంఠం సమీపంలోని అల్వార్‌కర్కుళం కావ డి వీధికి చెందిన మారియప్పన్‌ కుమారుడు ఇసక్కి రాజా (20). శ్రీవైకుంఠంలోని ప్రభుత్వ ఎయిడెడ్‌ ప్రైవేట్‌ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సుందర రాజన్‌ వారి పక్క ఇంట్లో నివసిస్తున్నాడు. తదనంతరం బంధువులు అయిన వీరిద్దరికి, ఆదివారం ఇంటి మురుగునీటి పారుద ల విషయంలో వివాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలో గ్రామ గుడిలో రాత్రిపూట తిరువిళక్కు పూజ నిర్వహించారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన మారియప్పన్‌, సుందరరాజన్‌ వర్గాల మధ్య అకస్మాత్తుగా ఘర్షణ చెలరేగింది. ఒకరిపై ఒకరు దాడి చేస్తుండగా ఇసాక్కి రాజాకు కత్తి పోట్లు ప డింది. ఇందులో అతను రక్తపు మడుగులో ఘటన స్థలం లోనే విషాదకరంగా అక్కడికక్కడే మరణించాడు.సమాచారం అందుకున్న శ్రీ వైకుంఠం పోలీ సులు ఇస క్కి రాజా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement