గుడ్‌ న్యూస్‌ షూటింగ్‌ పూర్తి..! | - | Sakshi
Sakshi News home page

గుడ్‌ న్యూస్‌ షూటింగ్‌ పూర్తి..!

Oct 27 2026 1:50 AM | Updated on Oct 27 2026 1:50 AM

తమిళసినిమా: నటుడు జయరామ్‌, అశ్విన్‌ హీరోలుగా నటించిన చిత్రం గుడ్‌ న్యూస్‌. దర్శకుడు పాండిరాజ్‌ సంభాషణలు అందించిన ఈ చిత్రం ద్వారా నాగేంద్ర మురుగన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మూవీట్రోన్‌ పతాకంపై సాయి వినోద్‌ జయకుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం కల్యాణి అనిల్‌ కథానాయిగా నటిస్తున్నారు. ఆషా చరత్‌, ముత్తు కుమార్‌, జాఫ ర్‌, ఖురేషీ, దీపా, వినోదిని, దివ్య, మణి మేఘలై, జాన్సన్‌ దివాకర్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇది కుటుంబ సభ్యుల భావోద్వేగాలు, సమాజంలోని ఇతరుల మనోభావాలను ఆవిష్కరించే కుటుంబ కథా చిత్రంగా ఉంటుందని యూనిట్‌ వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అన్న వర్గాలను అలరించే వినోదం, ప్రేమానురాగాలు వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిస్తున్న కథా చిత్రం ఇదిన్నా రు. షూ టింగ్‌ పూర్తి చేసుకున్న గుడ్‌ న్యూస్‌ చిత్రం ప్రస్తుతం ఎడిటింగ్‌ వంటి నిర్మాణాంతర కార్యక్రమా లు జరుపుకుంటోంది చెప్పారు. కాగా చిత్ర షూటింగ్‌ అనుభవాలను వెల్లడిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు.అందులో చిత్రం ప్రారంభం నుంచి పూర్తి అయ్యే వరకు తెర వెనుక పలు ఆసక్తికరమైన విషయాలను పొందుపరిచారు. అందులో యూనిట్‌ సభ్యుల హకారం, సమష్టి కృషి, పడ్డ శ్రమ వంటి పలు అంశా లు చోటు చేసుకున్నాయి. ఈ వీడియో ఇప్పుడు సా మాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. నటుడు జయరామ్‌ నటనాంకిత భావం, అందించిన సహకా రం చిత్రానికి పక్కా బలం అని యూనిట్‌ వర్గాలు చెప్పారు. కాగా చిత్ర విడుదల తదితర వివరాలను వరుసగా వెల్లడించనున్నట్లు యూనిట్‌ వర్గాలు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement