అద్భుత విజయం సాధించిన సాక్ష్య సంతోష్‌ | - | Sakshi
Sakshi News home page

అద్భుత విజయం సాధించిన సాక్ష్య సంతోష్‌

Oct 27 2026 1:50 AM | Updated on Oct 27 2026 1:50 AM

● సెమీస్‌లో సాయనిక, హిమోన్‌

విజేతలైన క్రీడాకారులు

సాక్షి, చైన్నె: తమిళనాడు ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ వేదికగా జరుగుతున్న డబ్ల్యూటీటీ యూత్‌ కంటెండర్‌ చైన్నె 2026 టేబుల్‌ టెన్నిస్‌ టోర్నీ చివరి రోజైన సోమవారం తీవ్ర ఉత్కంఠభరిత పోరుతో జరిగింది. తమిళనాడు క్రీడా అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 23 నుంచి సోమవారం వరకు 4 రోజుల టోర్నీలో అండర్‌11 నుంచి అండర్‌ 19 వరకు మొత్తం 12 విభాగాల్లో క్రీడాకారులు పోటీపడ్డారు. అండర్‌–11 బాలికల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో మూడో సీడ్‌ క్రీడాకారిణి సాక్ష్య సంతోష్‌ సంచలన విజయం సాధించింది. టాప్‌ సీడ్‌ సనంద స్రీజిత్‌పై 11–7, 9–11, 11–1, 11–4 తేడాతో ఘన విజయం సాధించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్స్‌లో సాక్ష్య రెండో సీడ్‌ ఆద్య బహేతితో తలపడనుంది. మరో సెమీస్‌లో 9వ సీడ్‌ కృతిక సైబో, 7వ సీడ్‌ అనికా మహేశ్వరితో పోటీపడనుంది. ఇక, అండర 19 బాలురు, బాలిక విభాగంలోసాహిల్‌, సాయనిక సంచలనం విజయం సాధించారు.

సెమీస్‌ పోరుకు సిద్ధం

అండర్‌ 15 బాయ్స్‌లో 13 ఏళ్ల హిమోన్‌ మోండల్‌ (20వ సీడ్‌) మలేషియాకు చెందిన 5వ సీడ్‌ కో వీ యోను, ఆపై రౌనక్‌ సర్కార్‌ను ఓడించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. సెమీస్‌లో రెండో సీడ్‌ వత్సల్‌ దుక్లాన్‌తో తలపడనున్నాడు. అండర్‌ 15 బాలిలక విభాగంలో 34వ సీడ్‌ శ్రేయా ధార్‌ 5వ సీడ్‌ జాన్వీ గార్గ్‌ను ఓడించి రెండో సీడ్‌ శ్రీజని చక్రవర్తితో క్వార్టర్స్‌లో తలపడనుంది. 10వ సీడ్‌ అద్వికా అగర్వాల్‌ 11వ సీడ్‌ ఇషాని గోగోయ్‌తో తలపడనుంది. అండర్‌ 11 బాలర విభాగం టాప్‌ సీడ్‌ శార్విల్‌ కరంబేల్కర్‌ 11–5, 11–1, 11–7 తో అశాంక్‌ దాల్వీపై విజ యం సాధించి సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. సెమీస్‌లో మూడో సీడ్‌ రెహానన్‌ సింఘ్వీతో తలపడనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement