దేవయాని వారసురాలు నాయకిగా.. | - | Sakshi
Sakshi News home page

దేవయాని వారసురాలు నాయకిగా..

Oct 27 2026 1:50 AM | Updated on Oct 27 2026 1:50 AM

తమిళసినిమా: సెలబ్రిటీల వారసుల సినీ రంగ ప్రవేశం అనేది సులభమే.అయితే నిలదొక్కుకోవడం అనేక వారి ప్రతిభ, అదృష్టాన్ని బట్టి ఉంటుంది. అలా చాలా మంది వారసులు ఈ రంగంలో రాణిస్తున్నారు. తాజాగా ప్రముఖ నటి దేవయాని, దర్శకుడు రాజ్‌కుమార్‌ దంపతుల వారసురాళ్లలో ఒకరైన ప్రియాంక రాజ్‌ కుమార్‌ రంజన్‌.ది అడ్వకేట్‌ అనే చిత్రం ద్వారా కథానాయికగా రంగప్రవేశం చేసిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ప్రియాంక రాజ్‌ కుమార్‌ కథానాయకిగా రెండో చిత్రం కూడా షూరూ అయ్యింది. ఈమె నటిస్తున్న ఈ చిత్రానికి బ్లాక్‌ నైట్‌ బాయ్స్‌ అనే టైటిల్‌ ను నిర్ణయించారు. కాగా ఈ చిత్రం ద్వారా బుల్లితెర నటుడు అమల్‌ అజిత్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు.అరుళ్‌ మురుగన్‌ పిక్చర్స్‌, డ్రీమ్‌ రన్‌ వే 26వ సెంచరీ సంస్థల ద్వారా కేఈ.మణికంఠన్‌ అలియాస్‌ విమల్‌ .జీ నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు పలు చిత్రాలకు పర్యవేక్షకులు బిజీగా పని చేసిన ఈయన నిర్మిస్తున్న తొలి చిత్రం ఇది.సెంబర్‌ వి.మురుగేశన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవల చైన్నెలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. వైవిధ్య భరితరిత ప్రేమతో కూడిన జనరంజక కుటుంబ కథా చిత్రంగా ఇది ఉంటుందని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో యూనిట్‌ వర్గాలు పేర్కొన్నారు. చిన్నా, పెద్దా అంటూ అన్ని వర్గాలను అలరించే విధంగా బ్లాక్‌ నైట్‌ బాయ్స్‌ చిత్రం ఉంటుందని పేర్కొన్నారు.ఈ చిత్రానికి మనోజ్‌ పరమహంస ఛాయాగ్రహణంను, జోశ్వా శ్రీధర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు యూనిట్‌ వర్గాలు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement