కొరుక్కుపేట: శ్రీ కన్యకా పరమేశ్వరి ఆర్ట్స్ అండ్ సైన్స్ మహిళా కళాశాల (ఎస్‌కేపీసీ) 24వ స్నాతకోత్సవాన్ని కళాశాల ప్రాంగణంలో సోమవారం వైభవంగా జరుపుకుంది. ఈ కార్యక్రమంలో 2022– 2025 బ్యాచ్‌కు చెందిన విద్యార్థినిలకు డిగ్రీలను అందజేశారు. కళాశాల కరస్పాండెంట్ చిన్ని బాలా జీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి చైన్నెలోని మద్రాస్ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్, ప్రొఫెసర్ రీటా జాన్ ముఖ్య అతిథిగా విచ్చేసి 542 మంది పట్టభద్రులకు డిగ్రీలను ప్రదానం చేశారు. తన ప్రసంగంలో ఆమె సంపూర్ణ విద్య యొక్క అపారమైన ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. మద్రాస్ విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మక వారసత్వం నుండి డిగ్రీలను అందుకున్నందుకు పట్టభద్రులు ఎంతో గర్వపడాలని కోరారు. ఆమె విద్యార్థులను జ్ఞానాన్ని అన్వేషించాలని, విలువలను నిలబెట్టుకోవాలని, వారి భవిష్యత్ ప్రయత్నాలలో విజయం కోసం కృషి చేయాలని మరింతగా ప్రేరేపించారు. విద్యార్థు లు తమ వృత్తి జీవితంలో తదుపరి దశలోకి అడుగుపెడుతున్న తరుణంలో వారి జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ శ్రీ చిన్ని బాలాజీ, ప్రిన్సిపల్ డా. ఎన్. వనజ, డీన్ డా. పి. బి. వనీత, వైస్ ప్రిన్సిపల్ డా. ఎం. వి. నప్పిన్నై, ఎస్‌కేపీడీ ధర్మకర్త కొల్లా వేంకట చంద్రశేఖర్, ట్రస్టీలు దేసు లక్ష్మీ నారాయణ, రామ కుమార్, కిషోర్ బాబు, అధ్యా పకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


