సాక్షి, చైన్నె : వోక్స్‌వ్యాగన్ ఇండియా తమ మొట్టమొదటి వి.ఇ. ట్రాక్ డే కార్యక్రమాన్ని తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న కోస్ట్‌టి రేస్‌ట్రాక్ వేదికగా ఘనంగా నిర్వహించింది. బ్రాండ్ ప్రసిద్ధ జీటీ వారసత్వాన్ని, డ్రైవింగ్ పై అభిమానుల్లో ఉన్న ఉత్సాహాన్ని వేడుకగా జరుపుకునేందుకు ఈ రెండు రోజుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.వోక్స్‌వ్యాగన్ పర్ఫార్మెన్స్ డ్రైవింగ్‌కు దేశంలో ఉన్న విపరీతమైన ఆదరణకు నిదర్శనంగా, 100 మందికి పైగా యజమానులు , ఔత్సాహికులు ఇందులో పాల్గొన్నారు.ఈ ఈవెంట్ రిజిస్ట్రేషన్లు కేవలం ఒక్క రోజులోనే పూర్తిగా నిండిపోయాయి. దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు ఇందులో పాల్గొనేందుకు ఆసక్తి చూపించారు.ఈ ట్రాక్ డేలో వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ , వర్టస్ జీటీ, టైగన్ జీటీ, , పోలో జీటీ, టేరాన్ , టిగువాన్ మోడళ్లలను ఒకే వేదికపైకి తీసుకువచ్చారు.రెండు రోజుల పాటు సాగిన ఈ వేడుకల్లో యజమానులు తమ వాహనాల పూర్తి సామర్థ్యాన్ని ,పనితీరును వృత్తిపరంగా నిర్వహించబడే సురక్షితమైన రేస్‌ట్రాక్ వాతావరణంలో నడిపి అనుభూతి చెందారు.


