సాక్షి, చైన్నె: ఊబకాయం, మధుమేహం , జీవక్రియ సంబంధిత చికిత్సల్లో ప్రత్యేకత కలిగిన చైన్నెకి చెందిన రివైవో క్లినిక్ నవంబర్ 14న జరిగే ప్రపంచ మధుమేహ దినోత్సవం పురస్కరించుకుని టైప్–2, డయాబెటిస్ ఉపశమన కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించింది. అందరికీ ఒకే తరహా వైద్య పద్ధతి కాకుండా, శాసీ్త్రయ ఆధారాలు, వైద్యపరమైన విచక్షణతో కూడిన వ్యక్తిగత అనుకూల విధానంతో ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దారు. పీఎంకే శాసన సభా పక్ష నేత డాక్టర్ సౌమ్య అన్బుమణి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.్ఙభారతదేశం ప్రపంచ డయాబెటిస్ రాజధానిగా మారుతున్న తరుణంలో, వ్యాధిని ముందస్తుగా గుర్తించడం, ఆరోగ్యకరమైన జీవనశైలి ఎంపికలపై రివైవో క్లినిక్ దృష్టి సారించడం అభినందనీయమని ఈ సందర్భంగా ఆమె పేర్కొంటున్నారు. దీర్ఘకాలిక జీవనశైలి మార్పుల ద్వారా టైప్–2 మధుమేహాన్ని అదుపు చేయడం నయం చేయడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. డయాబెటాలజిస్ట్, క్లినిక్ సహ వ్యవస్థాపకులు డాక్టర్ అరుణ్ రాఘవన్ మాట్లాడుతూ – మధుమేహం నుండి ఉపశమనం పొందే ప్రక్రియ శాసీ్త్రయంగా సాధ్యమే అని, అయితే, దీనికి నిరంతర వైద్య పర్యవేక్షణ, వ్యక్తిగతీకరించిన శారీరక కార్యకలాపాలు అత్యవసరంగా పేర్కొన్నారు.


