ఆటో డ్రైవర్‌ల వినూత్న ధర్నా | - | Sakshi
Sakshi News home page

ఆటో డ్రైవర్‌ల వినూత్న ధర్నా

Oct 27 2026 1:50 AM | Updated on Oct 27 2026 1:50 AM

ఆటో డ్రైవర్‌ల వినూత్న ధర్నా

వేలూరు: తమ జీవనోపాధిని కాపాడాలని కోరుతూ ఆటో డ్రైవర్‌లు వేలూరు కలెక్టరేట్‌ ఎదుట మెడకు ఉరితాడు వేసుకొని వినూత్నంగా ధర్నా నిర్వహించారు. వేలూరు జిల్లా అన్ని ఆటో డ్రైవర్స్‌ యూనియన్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షులు ఏయుమలై అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులు పరశురామన్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వెట్రిపయనం పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్‌లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. తాము డిగ్రీలు చేతబట్టి ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో స్వయం ఉపాధిని నమ్ముకొని ఆటోలు కొనుగోలు చేసి నడుపుకుంటూ కుటుంబాన్ని కాపాడుకుంటున్నామన్నారు. అయితే ప్రభుత్వం ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశ పెట్టడం ద్వారా ఆటో కార్మికులు జీవనోపాధి పూర్తిగా కోల్పోయామన్నారు. ప్రభుత్వం అర్హత గల ఆటో డ్రైవర్‌లకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఆటో డ్రైవర్‌ల ఉపాధిపై ప్రతిఊల ప్రభావం చూపుతున్న ఓలా, రెడ్‌ట్యాక్సీ, రాపిడో వంటి సేవలను నిషేదించాలని, డ్రైవర్‌లకు తెలియకుండా పోలీసులు ఆన్‌లైన్‌లో కేసులు నమోదు చేయడాన్ని మానుకోవాలని తదితర డిమాండ్‌లు పరిష్కరించాలని నినాదాలు చేశారు. సింబుదేవన్‌, సలాం, అన్ని ఆటో కార్మికులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement