రెండు రైళ్ల పై దాడి | - | Sakshi
Sakshi News home page

రెండు రైళ్ల పై దాడి

Oct 27 2026 1:50 AM | Updated on Oct 27 2026 1:50 AM

రెండు రైళ్ల పై దాడి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటేందుకు ముందుకు రావాలి పునరావాస కేంద్రాల్లోని విద్యార్థులకు సాయం తూత్తుకుడి జిల్లాలో గర్భిణిని బెదిరించిన వ్యక్తి ●కొంటి చంపిన స్థానికులు

సాక్షి,చైన్నె: ఎక్స్‌ప్రెస్‌ రైళ్లపై రాళ్లదాడికి పాల్పడిన రెండు వేర్వేరు ఘటనలను దక్షిణ రైల్వే చైన్నె డివిజన్‌కు చెందిన రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ అధికారులు చాకచక్యంగా ఛేదించారు. ఈ ఘటనలకు సంబంధించి ఇద్దరు మైనర్లను ఆర్‌పీఎఫ్‌ బృందం అదుపులోకి తీసుకుంది.కోయంబత్తూర్‌ – చైన్నె సెంట్రల్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌పై లత్తేరి – కాట్పాడి రైల్వే స్టేషన్ల మధ్య ఈనెల 22న రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో కోచ్‌ కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి.అలాగే, ఎస్‌ఎమ్‌విటి బెంగళూరు – అగర్తలా హమ్‌సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌పై 23వ తేదిన సెవూర్‌ – తిరువలం రైల్వే స్టేషన్ల మధ్య జరిగిన దాడిలో కిటికీ అద్దాలు దెబ్బతిన్నాయి. కాట్పాడి ఆర్‌పీఎఫ్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ సి. సురేంద్ర కుమార్‌, హెడ్‌ కానిస్టేబుళ్లు కె. రాజశేఖర్‌, సి. సతీష్‌ బాబులతో కూడిన బృందం రైల్వే ట్రాక్‌ల వెంట తీవ్ర గాలింపు చర్యలు చేపట్టింది. 13, 14 ఏళ్ల మైనర్‌లను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.ప్రాథమిక విచారణలో ఆ మైనర్లు ఇద్దరూ రైల్వే ప్రాంగణంలోకి అక్రమంగా ప్రవేశించి, సరదాగా విసిరిన రాళ్లు కదులుతున్న రైళ్ల అద్దాలకు తగిలినట్లు తేలింది. ఈ ఘటనలపై రైల్వే చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. చట్టపరమైన ప్రక్రియల అనంతరం, వెల్లూరులోని జువైనల్‌ జస్టిస్‌ బోర్డు ముందు హాజరుపరచాలనే షరతుపై మైనర్లను వారి తల్లిదండ్రులకు బెయిల్‌పై అప్పగించారు.

వేలూరు: ప్రతి ఒక్కరూ విఽధిగా చెట్లు నాటేందుకు ముందుకు రావాలని వేలూరు వీఐటీ యూనివర్సిటీ ఉపాధ్యక్షులు జీవీ సెల్వం అన్నారు. ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిరుపేద మహిళలకు కుట్టు మిషన్‌లు, సంక్షేమ పథకాలు, చెట్లు నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. సోమవారం ఉదయం ఆయన జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం పీవీఆర్‌ సినిమా థియేటర్‌ సమీపంలో మొక్కలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జీవీఎస్‌ బృందం సభ్యులు గణేష్‌, వినోద్‌, పుణ్యకోటి, న్యాయవాది పీడికే మారన్‌, శ్రీనివాసన్‌, భూమినాదన్‌, సతీష్‌కుమార్‌, సుందర్‌ తదితరులు పాల్గొన్నారు.

వేలూరు: శ్రీలంక పునరావాసుల విద్యార్థుల ఉన్నత విద్యకు ప్రతి ఒక్కరూ సహాయం అందజేయాలని రెప్‌కో బ్యాంక్‌, రెప్‌కో హోమ్‌ పైనాన్స్‌ చైర్మన్‌ సంతానం అన్నారు. వేలూరులోని అలిమేలు మంగాపురం ఉన్న ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో శ్రీలంక పునరావాసుల విద్యార్థులతో పాటు మహిళలకు సంక్షేమ పథకాలు పంపిణీ కార్యక్రమం రెఫ్‌కో మైక్రో పైనాన్స్‌ డైరెక్టర్‌ తంగరాజ్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా చైర్మన్‌ సంతానం మాట్లాడుతూ బ్యాంకు ఆధ్వర్యంలో ఏటా రాష్ట్రంలోని ఒక జిల్లాలో ఉన్న శ్రీలంక పునరావాస కేంద్రాల్లో నిరుపేదలను ఎంపిక చేసి సంక్షేమ పథకాలను అందజేస్తున్నామన్నారు. అందులో భాగంగా ప్రస్తుతం వేలూరు జిల్లాలోని మొత్తం 694 మందిని ఎంపిక చేసి విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో రెప్‌కో బ్యాంకు వేలూరు శాఖ మేనేజర్‌ తదితరులు పాల్గొన్నారు.

తిరువొత్తియూరు: తూత్తుకుడి జిల్లా ఏరల్‌ సమీపంలో గర్భిణినిఅసభ్యంగా మాట్లాడి, ఆమె భర్తను చంపేస్తానని బెదిరించిన ధనుష్కోడి అనే వ్యక్తిని, ఆగ్రహించిన స్థానికులు కొట్టి చంపారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఏరల్‌ సమీపంలోని సూరప్పనాయకన్‌పట్టికి చెందిన శక్తి అనే వ్యక్తి భార్య పేచ్చియమ్మాళ్‌ (20). ఈమె మూడు నెలల గర్భిణి. గత 23వ తేదీ మధ్యాహ్నం పేచ్చియమ్మాళ్‌ మెడికల్‌ చెకప్‌ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా, మద్యం మత్తులో ఉన్న ధనుష్కోడి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై పేచ్చియమ్మాళ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో అదే రోజు మధ్యాహ్నం స్థానికులు కొందరు (కడలైమణి, సాముదురై, అజిత్‌ తదితరులు) ధనుష్కోడిపై కరల్రు, చేతులతో తీవ్రంగా దాడి చేయడంతో అతడు మరణించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement