క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Oct 26 2026 2:28 AM | Updated on Oct 26 2026 2:28 AM

కురింజి నిలమ్‌ పేరుతో

కొండప్రాంతాల్లో వైద్య శిబిరం

తిరువొత్తియూరు: మాజీ ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ గత 2021వ సంవత్సరంలో కృష్ణగిరి జిల్లా, సామనపల్లిలో మక్కలై తేడి మరుతువం (ప్రజల వద్దకు వైద్యం) పథకాన్ని ప్రారంభించారు. వైద్య సేవలను ప్రజలు ఉండే ఇళ్ల వద్దకే వెళ్లి, వ్యాధులకు మందులు పంపిణీ చేశారు. అందులో భాగంగా వైద్య సేవలు అందుబాటు లో లేని కొండ ప్రాంతాల ప్రజల ఇళ్లకు కూడా వెళ్లి వైద్య చికిత్స అందించడం జరిగింది. ప్రస్తుతం మాజీ మంత్రి మా. సుబ్రమణియన్‌ చొరవతో కొండ ప్రాంత ప్రజలకు వైద్య సేవలను నిరంతరాయంగా అందించడం కోసం కురింజి నలమ్‌ అనే స్వచ్ఛంద వైద్య సంస్థను ప్రారంభించారు. చైన్నె అన్నా అరివాలయ నందు డి.ఎమ్‌.కె. అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ ఈ సంస్థను ప్రారంభించారు. ఈ క్రమంలో ఆదివారం తేని జిల్లా, కురంగణి కొండ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ప్రయోజనం పొందేలా, కొండ ప్రాంత ప్రజల వద్దకు వెళ్లి ప్రత్యేక ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని కురింజి నలమ్‌. వైద్య సేవా సంస్థ వ్యవస్థాపకుడు, మాజీ మంత్రి సుబ్రమణియన్‌ ప్రారంభించారు. ఈ శిబిరంలో తంగ తమిళసెల్వన్‌ ఎం.పి. పాల్గొన్నారు.

కళాశాల విద్యార్థి

అనుమానాస్పద మృతి

– ప్రేమ వైఫల్యమా? విచారణ

అన్నానగర్‌: తిరువిక నగర్‌లో ఒక కళాశాల విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ప్రేమ వ్యవహారం విఫలమవ్వడం వల్ల అతను ఆత్మహత్య చేసుకున్నాడా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చైన్నెలోని పెరవల్లూరు, కె.సి. గార్డెన్‌ 2వ వీధి కి చెందిన విఘ్నేష్‌ అనే విక్కీ (23). ఇతను ఒక ప్రైవేట్‌ కళాశాలలో బి.ఎస్‌.సి. కంప్యూటర్‌ సైనన్స్‌ 2వ సంవత్సరం చదువుతున్నాడు. ఈ స్థితిలో, ఇతను గత 6 నెలలుగా కళాశాలకు వెళ్లలేదు. శనివారం రాత్రి సుమారు 8 గంటలకు అతని తల్లిదండ్రులు పనికి వెళ్లిన తర్వాత విఘ్నేష్‌ పడకగదిలో నిద్రపోతున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో పని నుండి తిరిగి వచ్చిన అతని తల్లి అతనిని నిద్రలేపింది. అప్పుడు, అతను సృహ కోల్పోయి ఉండటం చూసి తల్లి దిగ్భ్రాంతి చెందింది. ఆమె కేకలు విని ఇరుగుపొరుగు వారు వచ్చి అతనిని పెరియార్‌ నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పుడే విఘ్నేష్‌ మరణించినట్లు తెలిసింది. తిరువిక నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విఘ్నేష్‌ ఒక అమ్మాయిని ప్రేమించాడని, అయితే ఆమె అతడిని అంగీకరించలేదని, ఈ కారణంగా, అతను గత 6 నెలలుగా కాలేజీకి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ, తరచుగా మద్యం తాగుతున్నాడని తెలుస్తుంది. అందువల్ల, అతను మద్యంలో విషం కలుపుకుని ఆత్మహత్య చేసుకున్నాడా లేక శారీరక సమస్యతో మరణించాడా అనేది పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడవుతుందని పోలీసులు తెలిపారు.

సంగమేశ్వరర్‌కు అన్నాభిషేకం

పళ్ళిపట్టు: ఐప్పసి నెల పౌర్ణమి సందర్భంగా శివాలయాల్లో ఆదివారం అన్నాభిషేక పూజలు నిర్వహించి భారీ సంఖ్యలో భక్తులు స్వామి దర్శనం చేసుకున్నారు. పళ్లిపట్టు బస్టాండు సమీపంలోని పురాతన సంగమేశ్వరస్వామి ఆలయంలో ఐప్ససి పౌర్ణమి సందర్భంగా ఉద యం స్వామికి అన్నంతో అభిషేక పూజలు చేపట్టారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు స్వామి అన్నాభిషేక అలంకరణలో భక్తులకు కటాక్షించారు. పళ్ళిపట్టు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారు. కాగా మధ్యాహ్నం వెయ్యి మంది భక్తులకు ఆలయ నిర్వాహకులు అన్నదానం పంపిణీ చేసారు. ఇదే విధంగా పలు ప్రాంతా ల్లోని శివాలయాల్లోనూ అన్నాభిషేక పూజలు చేశారు.

నర్సు ఉరి వేసుకుని ఆత్మహత్య

అన్నానగర్‌ : చైన్నెలోని ఓట్టేరి, తిరువికా వీధి నివాసి నానినరసయ్య. ఇతని భార్య నిరోషా అలియాస్‌ సంగీత (21). ఆమె కోసప్పేట్టైలోని ఒక ప్రైవేట్‌ నర్సింగ్‌ హోమ్‌లో నర్సుగా పని చేస్తుంది. 2021లో, నిరోషా ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది, కానీ ఆ బిడ్డ 11 నెలల తర్వాత మరణించింది. నిరోషా ప్లేట్‌లెట్‌ లోపానికి కూడా చికిత్స పొందుతోంది. శనివారం రాత్రి పని ముగించుకుని ఇంటికి వచ్చిన నిరోష, హాలులో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి వచ్చిన భర్త, తన భార్య చనిపోయి ఉండటాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఈ విషయంపై సమాచారం అందుకున్న ఓట్టేరి పోలీసులు వెళ్లి సంగీత అలియాస్‌ నిరోష మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం కోసం కిల్పాకం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. ఈ విషయమై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement