తిరుత్తణి: జోరువాన నడుమ తిరుత్తణి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగింది. రెండు గంటల పాటు వేచివుండి భక్తులు స్వామి దర్శనం చేసుకున్నారు. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో సెలవు రోజుల్లో సాదారణంగా భక్తుల రద్దీ నెలకొంటుంది. అయితే ఈశాన్య రుతుపవనాల నేపధ్యంలో ఇటీవల క్రమంగా వానలు కురుస్తున్న క్రమంలో ఆలయంకు వచ్చే భక్తులు రద్దీ తగ్గడం సాధారణం అయితే. వర్షాలు సైతం లెక్కచేయకుండా భక్తులు యధా ప్రకారం కొండ ఆలయంలో పోటెత్తి రెండు గంటల పాటు సర్వ దర్శనం క్యూలైన్‌లో వేచివుండి స్వామి దర్శనం చేసుకున్నారు.


