తమిళ సినిమా: కోలీవుడ్‌లో రెండు చిత్రాల్లో నటించినా మంచి విజయాన్ని అందుకోలేకపోయిన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్. కన్నడం, మలయాళం, తమిళం భాషల్లో నటిస్తున్న నటి ఈమె. ఏస్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన రుక్మిణి వసంత్‌ను ఆ చిత్రం పూర్తిగా నిరాశ పరిచింది. ఆ తర్వాత శివకార్తికేయన్‌కు జంటగా మదరాసీ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకున్నారు. ఏఆర్.మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇటీవల ఈమె నటించిన కన్నడ చిత్రం కాంతార మంచి పేరు తెచ్చిపెట్టింది. అదే విధంగా తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన డ్రాగన్ చిత్రంలో నటించే అవకాశం వరించింది. ఇలా వరుసగా అవకాశాలను అందుకుంటున్న రుక్మిణి వసంత్‌కు తాజాగా కోలీవుడ్‌లో మరో ఛాన్స్ వచ్చింది. ఎస్ఎస్.శ్రీకార్తీక్ దర్శకత్వం వహించనున్న తాజా చిత్రానికి నటి రుక్మిణి వసంత్‌ను ఎంపిక చేశారు. ఇంతకు ముందు కోణం చిత్రం చేసి మంచి పేరు తెచ్చుకున్న శ్రీకార్తిక్ తన కొత్త చిత్రానికి సిద్ధం అవుతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనతో కూడిన ఒక వీడియోను విడుదల చేశారు. అందులో తారా అనే పాత్ర కోసం నటి రుక్మిణి వసంత్‌ను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. అదే విధంగా ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలతో కూడిన వీడియోలను వరుసగా విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ చిత్రమైనా నటి రుక్మిణి వసంత్‌కు తమిళంలో మంచి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.
రుక్మిణి వసంత్


