సాక్షి,చైన్నె: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ చల్లానీ జ్యువెలరీ మార్ట్ తమ అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా జేసన్ సంజయ్‌ను నియమించినట్లు ప్రకటించింది. సాంప్రదాయ పురాతన, వజ్రాల, టెంపుల్, జడావు పోల్కి , ప్లాటినం ఆభరణాల కలెక్షన్లకు పేరుగాంచిన ఈ బ్రాండ్, యువతరం వినియోగదారులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా జేసన్ సంజయ్, చల్లానీ జ్యువెలరీ మార్ట్ యొక్క సోషల్ మీడియా ప్రచారాలు, బహుళ–ప్లాట్‌ఫారమ్ ప్రకటనలలో బ్రాండ్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జయంతిలాల్ చల్లానీ మాట్లాడుతూ దర్శకుడు సంజయ్ కొత్త తరం ఆత్మవిశ్వాసానికి, నూతన శక్తికి ప్రతిరూపం నా పేర్కొన్నారు. తమ విశ్వసనీయతకు ఆయన యువతరం దక్పథం తోడవ్వడం బ్రాండ్ వృద్ధికి ఎంతో సహాయపడుతుందన్నారు. ప్రస్తుతం చైన్నె, మదురై, పుదుచ్చేరిలలో విస్తరించిన చల్లానీ జ్యువెలరీ మార్ట్, తమ సుదీర్ఘ వారసత్వానికి సమకాలీన డిజైన్లను జోడించి అన్ని తరాల వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు ప్రణాళికలు రచిస్తోందన్నారు. జేసన్ సంజయ్ మాట్లాడుతూ గుర్తింపు అనేది మనం స్వయంగా నిర్మించుకునేది, వారసత్వంగా పొందేది కాదు. చల్లానీ ఆ స్వతంత్ర స్ఫూర్తి నన్ను ఎంతగానో ఆకట్టుకుంది అని వ్యాఖ్యానించారు.


