వేలూరు: వేలూరులో మరుదపాండియర్‌ల 225వ వర్ధంతి సభను పురస్కరించుకుని వేలూరులో తోటపాళ్యంలోని ధర్మరాజ ఆలయ ప్రాంగణంలో పాండియర్‌లకు స్మారక కార్యక్రమం నిర్వహించారు. ముందుగా అక్టోబర్ 24 మరుదు యువజన ఉద్యమ వ్యవస్థాపకుడు వీఎంబీ అప్పు బాలాజీ మొదలియార్ ఆధ్వర్యంలో మరుదు పాండియర్ విగ్రహాలకు పూల మాల వేసి నివాళులు అర్పించడంతో పాటు స్మారక జెండాను ఎగరవేశారు. అనంతరం వారి ఆత్మ శాంతి కలగాలని కోరుతూ మోక్షదీపం వెలిగించడంతో పాటు పుష్పాంజలి ఘటించారు. ఇందులో వేలూరు ఎమ్మెల్యే వినోద్ కన్నన్ ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఎగరవేసి నిరుపేద విద్యార్థులకు నోటు పుస్తకాలతో పాటూ పెన్‌లు, నిరుపేదలకు దుస్తులను అందజేశారు. అనంతరం మధ్యాహ్నం నిరుపేదలకు అన్నదానం చేశారు. అదేవిధంగా అప్పు బాలాజీ మొదలియార్ అధ్యక్షతన వృద్ధాప్య ఆశ్రమంలో మరుదుపాండియర్‌ల చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించి అన్నదానం చేశారు. కార్యక్రమంలో వీసీకే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నీల చంద్రకుమార్, జిల్లా కార్యదర్శి పిలీఫ్, బీజేపీ వేలూరు జిల్లా అధ్యక్షులు దశరదన్, పారిశ్రామికవేత్త పయణి, ఎల్‌కేఎంబీ వాసు, అక్టోబర్ 24 మరుదు యువజన ఉద్యమ సంఘం ప్రతినిధులు, వివిధ పార్టీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.


