మైలో చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదల | - | Sakshi
Sakshi News home page

మైలో చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదల

Oct 25 2026 1:23 AM | Updated on Oct 25 2026 1:23 AM

మైలో చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదల

తమిళ సినిమా: యువ నటుడు ముగెన్‌ రావ్‌ కథా నాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మైలో. దీన్ని ఎస్‌ఎస్‌ఆర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై కేఎల్‌ సురేష్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, దర్శకత్వం బాధితులను కవిన్‌ మూర్తి నిర్వహిస్తున్నారు. నటి తేజు అశ్విని నాయకగా నటిస్తోంది. ఇందులో ఇళవరసు, మునీష్‌ కాంత్‌, బిగ్‌ బాస్‌ ఫెబ్‌ జనని, సురేష్‌ మీనన్‌, ఆదిత్య కధీర్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎంగళ్‌ అన్న చిత్రం పేరు ఇంద్రజ సుమారు 20 ఏళ్ల తర్వాత చిత్రం ద్వారా తమిళంలో రియల్లీ ఇస్తున్నారు. ఆమె ఇందులో చాలా కీలకపాత్రను పోషిస్తున్నారు. అదేవిధంగా ఒక పెట్‌ డాగ్‌ ముఖ్య పాత్రను పోషిస్తోంది. యూనిట్‌ సభ్యులు చిత్ర వివరాలను మీడియాకు విడుదల చేశారు. వారు మాట్లాడుతూ చిత్రం షూటింగును చైన్నె, ఊటీ, కొల్లి మలై, మూనారు, తిరువనంతపురం, మలేషియా ప్రాంతాల్లో నిర్వహించి పూర్తి చేసినట్లు తెలిపారు. 18 ఏళ్ల క్రితం జరిగిన ఒక నేరాన్ని హీరో మైలో అనే పెట్‌ డాగ్‌ సాయంతో ఎలా వెలికితీశాడన్న పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిస్తున్న సస్పెన్‌, థ్రిల్లర్‌ కథ ఇది అని తెలిపారు. చిత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదల చేసినట్లు చెప్పారు. ఎత్తైన ప్రదేశంలో నిలబడిన హీరో కాళ్ల వద్ద నిలుచున్న కుక్క పిల్లతో కూడిన పోస్టర్‌లో మోర్‌ దెన్‌ ఏ పెట్‌ ఏ సైలెంట్‌ విట్‌నెస్‌ అనే క్యాప్షన్‌తో కూడిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని యూనిట్‌ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. చిత్రం ఆడియో, ట్రైలర్‌, చిత్రం థియేటర్‌ విడుదల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఈ చిత్రానికి జెన్‌ మార్టిన్‌ సంగీతాన్ని, జీజూసన్నీ ఛాయాగ్రహణంను అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement