తిరువళ్లూరు: విద్యారంగాన్ని నిర్వీర్యం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సినీ డైరెక్టర్ పేరరసు డిమాండ్ చేశారు. ముత్తురామలింగ దేవర్ 118వ గురుపూజ కార్యక్రమాన్ని మనవాలనగర్‌లోని ఓ ప్రైవేటు కల్యాణమండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఓబీసీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజ్‌కుమార్ అధ్యక్షత వహించగా సినీ డైరెక్టర్ పేరరసు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయంలో సంపాదించాలన్న లక్ష్యంతో పార్టీ పెట్టకూడదని, ప్రజలకు తమ వంతు సాయం చేయాలన్న తపనతోనే పార్టీని పెట్టి ముందుకు రావాలని సూచించారు. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ప్రజలకు సేవచేస్తూ తమ జీవితాలను ప్రజలకే అంకితం చేఆయలని ఆయన సూచించారు. గత డీఎంకే హయాంలో విద్యాశాఖ మంత్రిగా వున్న అన్బిల్‌మహేష్‌పై వంద కోట్లు రూపాయల అవినీతి ఆరోపణలు వచ్చిన విషయంపై పేరరసు స్పందిస్తూ, విద్యారంగాన్ని భ్రష్టుపట్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు కరుణాకరన్, మణిగండన్, జిల్లా ఉపాధ్యక్షుడు జైగణే ష్ పాల్గొన్నారు.


