చైన్నెలో ఘనంగా ఎస్‌ఐకాన్‌ 2026 | - | Sakshi
Sakshi News home page

చైన్నెలో ఘనంగా ఎస్‌ఐకాన్‌ 2026

Oct 25 2026 1:17 AM | Updated on Oct 25 2026 1:17 AM

చైన్నెలో ఘనంగా ఎస్‌ఐకాన్‌ 2026 సహకార సంఘ రిజిస్ట్రార్‌ను బదిలీ చేయాలని నిరసన ట్యూషన్‌కు వెళ్లిన బాలుడి కిడ్నాప్‌?

సాక్షి, చైన్నె: భారత ఎండోక్రైన్‌ సొసైటీ 55వ వార్షిక సదస్సు ఎస్‌ఐకాన్‌ 2026 చైన్నె ట్రేడ్‌ సెంటర్‌లో జరుగుతోంది. దేశవిదేశాల నుంచి 350 మందికి పైగా వైద్య నిపుణులు, పరిశోధకులు ఈ సదస్సుకు హాజరయ్యారు. మధుమేహం (షుగర్‌), ఊబకాయం, థైరాయిడ్‌, ఆస్టియోపోరోసిస్‌ వంటి సమస్యలపై లోతైన చర్చలు , 100కు పైగా సరికొత్త పరిశోధనా పత్రాల సమర్పణకు. ఈ సదస్సు వేదికగా నిలిచింది. వైద్య విద్యార్థుల కోసం యూఎస్‌ బోర్డ్‌ రివ్యూ తరహాలో ప్రత్యేక శిక్షణా కార్యక్రమం, మొదటిసారిగా ఓపెన్‌ క్విజ్‌ పోటీలు. రోగులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు జరిగాయి చివరి రోజైన ఆదివారం టైప్‌–1 డయాబెటిస్‌, పీసీఓఎస్‌, థైరాయిడ్‌ బాధితుల కోసం వైద్యులతో నేరుగా ముఖాముఖి కార్యక్రమం, తమిళ సంస్కృతి ఆవిష్కరణ,ప్రాచీన తమిళ సాహిత్యంలోని కురింజి, ముల్లై, మరుదం, నెయ్దల్‌, పాలై పేర్లను సదస్సు హాళ్లకు పెట్టడం, సంప్రదాయ ఆహార పదార్థాలు, ‘కడైవీధి’ పేరుతో వీధి వాతావరణాన్ని కల్పిస్తూ ఏర్పాటు చేయడం విశేషం విశేషం.

తిరువళ్లూరు: తమిళనాడు ప్రభుత్వ సహాకార శాఖ ఉద్యోగుల న్యాయమైన పలు డిమాండ్‌లను నెరవేర్చాలని కోరుతూ జాయింట్‌ రిజిస్టర్‌ కార్యాలయం వద్ద ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఈ ఆందోళనకు సంఘం జిల్లా కార్యదర్శి ఇళయరాజన్‌ అధ్యక్షత వహించగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేఘనాథన్‌ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు వ్యతిరేకం వ్యవహరిస్తున్న సహకార సంఽఘం రిజిస్టర్‌ను వెంటనే బదిలీ చేయాలని నినాదాలు చేశారు.

అన్నానగర్‌: కృష్ణగిరి జిల్లా ఊత్తంగరై సమీపం లో ఉన్న ఉప్పరపట్టి సాలకినిరిమొత్తూరు గ్రామానికి చెందిన తిరునావుక్కరసు (41). అతని కుమారుడు సంజయ్‌ (12) ఊత్తంగరైలోని ఒక ప్రైవేట్‌ మెట్రిక్యులేషన్‌ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ట్యూషన్‌ కు వెళ్లిన సంజయ్‌ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో అతని కోసం పలుచోట్ల వెతికారు. అయిన కాని అతని ఆచూకీ తెలియలేదు. అనంతరం తిరునావుక్కరసు సింగరపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీని ప్రకారం, పోలీసులు ఆ బాలుడు రోజూ ట్యూషన్‌కు వెళ్లేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు ఉన్న సీసీటీవీ కెమెరా రికార్డింగ్‌లను పరిశీలించి ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement