పాఠశాల విద్యార్థుల కోసం 5.32 లక్షల సైకిళ్లు | - | Sakshi
Sakshi News home page

పాఠశాల విద్యార్థుల కోసం 5.32 లక్షల సైకిళ్లు

Oct 25 2026 1:17 AM | Updated on Oct 25 2026 1:17 AM

● ‘హీరో సైకిల్స్‌’కు భారీ టెండర్‌

సాక్షి, చైన్నె: తమిళనాడు ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల సంక్షేమమే లక్ష్యంగా మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం ఉచితంగా అందించేందుకు 5.32 లక్షల అత్యాధునిక సైకిళ్లను కొనుగోలు చేయడానికి నిర్వహించింది. ప్రసిద్ధ ‘హీరో సైకిల్స్‌’ కంపెనీతో ఇందుకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పథకం అమలు కోసం తమిళనాడు ప్రభుత్వం ఇటీవల బహిరంగ టెండర్లను ఆహ్వానించింది. ఇందులో దేశంలోని పలు ప్రముఖ సైకిళ్ల తయారీ కంపెనీలు పాల్గొనగా, అత్యల్ప ధరను నిర్ణయించి నాణ్యమైన ప్రమాణాలను ప్రతిపాదించిన హీరో సైకిల్స్‌ నిర్వహణ కాంట్రాక్టర్‌గా ఎంపికై ంది. చైన్నె కేంద్రంగా ఈ సైకిళ్ల సరఫరా, అసెంబ్లింగ్‌ ప్రక్రియను చేపట్టేందుకు టెండర్‌ కేటాయించినట్లు తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

విజయవంతంగా సంకీర్ణ ప్రభుత్వ పథకాలు

గత ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో టీవీకే పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. సంపూర్ణ మెజారిటీకి స్వల్ప స్థానాల తేడా ఉండటంతో... కాంగ్రెస్‌, వి.సి.కె,, ఐ.యు., ఐ.ఎల్‌. తదితర మిత్రపక్షాల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రి విజయ్‌ నేతత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అసెంబ్లీలో పలు ప్రజాకర్షక ప్రకటనలు చేసింది.ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అమలులోకి తెచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రులలో జన్మించిన పసిపిల్లలకు 1 గ్రాము బంగారు ఉంగరాన్ని కానుకగా అందిస్తున్నారు. పలు పథకాలను విజయవంతంగా అమలు చేస్తూ వస్తున్న సమయంలో తాజాగా ఉచిత సైకిళ్ల పంపిణీకి సిద్ధమయ్యారు. విద్యార్థుల బడి హాజరును పెంచడానికి, దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల రవాణా కష్టాలు తీర్చడానికి ఈ అత్యాధునిక సైకిళ్ల పథకాన్ని అమ లు చేస్తున్నారు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 892 కోట్లు ఇందులో ప్రారంభ బడ్జెట్‌ కేటాయింపు రూ. 277 కోట్లు ఇచ్చారు. వర్క్‌ ఆర్డర్‌ జారీ అయి న వెంటనే, అదనపు నిధులను కేటా యించడానికి చర్యలు తీసుకోనుందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement