అట్టహాసంగా రాజస్థానీ బజార్‌ ఆరంభం | - | Sakshi
Sakshi News home page

అట్టహాసంగా రాజస్థానీ బజార్‌ ఆరంభం

Oct 25 2026 1:17 AM | Updated on Oct 25 2026 1:17 AM

కొరుక్కుపేట: రాజస్థానీ అసోసియేషన్‌ తమిళనాడు ఆధ్వర్యంలో రెండు రోజులు పాటు ఏర్పాటు చేసిన 7వ ఎడిషన్‌ రాజస్థానీ బజార్‌ శనివారం ఉదయం ఆరంభమైంది .చైన్నె రాయపేటలోని వైఎంసీఏ గ్రౌండ్‌ వేదికగా ఏర్పాటైన ఈ ఎగ్జిబీషన్‌ను ప్రముఖ సినీ నటి నటి మృణాలిని రవి ముఖ్యఅతిథిగా విచ్చేసి రిబ్బన్‌ కట్‌ లాంఛనంగా ప్రారంభించారు. ఈ నెల 24, 25 తేదీలలో రెండు రోజుల పాటు జరిగే ఈ జీవనశైలి ప్రదర్శనలో భారతదేశం నలుమూలల నుండి 130 మందికి పైగా ప్రదర్శకులు పాల్గొని స్టాల్స్‌ను కొలువుదీర్చారు. ఇది విభిన్న రకాల జీవనశైలి ఉత్పత్తులను ఒకచోట చేర్చి, దేశ హస్తకళలు , సాంస్కృతిక సంప్రదాయాలను ప్రదర్శిస్తోంది. ఈ సందర్భంగా రాజస్తానీ అసోసియేషన్‌ తమిళనాడు అధ్యక్షులు అజిత్‌ కుమార్‌ ఛోర్డియా , రాజస్తానీ బజార్‌ ఛైర్మన్‌ హేమంత్‌ దుగర్‌ మాట్లాడుతూ ఈ ప్రదర్శన సందర్శకులకు దేశంలోని వివిధ ప్రాంతాల ఉత్పత్తులను ఒకే వేదికపై కొనే అవకాశాన్ని అందిస్తుందన్నారు. ప్రదర్శకులను, వినియోగదారులను ఒకచోట చేర్చడం, రాజస్థానీ బజార్‌ వ్యాపారాలకు వారి ఉత్పత్తులను ప్రదర్శించడానికి ఒక వేదికను అందించడం, సాంస్కృతిక మార్పిడిని, సామాజిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు భారతదేశపు విభిన్న మార్కెట్లు, సంప్రదాయాల స్ఫూర్తిని చైన్నె ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాజస్థానీ బజార్‌ ఒక అవకాశమని, ఇందులో 130 మందికి పైగా ప్రదర్శనకారులు పాల్గొన్నారని తెలిపారు. ముఖ్యఅతిథి మృణాలిని రవి మాట్లాడుతూ రాజస్థానీ బజార్‌ ఉత్తేజపరిచేలా చేస్తుందన్నారు. ప్రత్యేకించి జ్యూవెలరీ, ఫ్యాషన్‌ దుస్తులు, హోమ్‌ డెకర్‌, ఫుట్‌వేర్‌ , చేనేత, హస్తకళలు, ఆహారం వంటి స్టాల్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement