ఎస్‌ అండ్‌ టీ శిక్షణ కేంద్రంలో ‘కవచ్‌ ల్యాబ్‌’ | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ అండ్‌ టీ శిక్షణ కేంద్రంలో ‘కవచ్‌ ల్యాబ్‌’

Oct 25 2026 1:17 AM | Updated on Oct 25 2026 1:17 AM

● ప్రారంభించిన సదరన్‌ రైల్వే జీఎం

సాక్షి, చైన్నె: సదరన్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌ యు. సుబ్బారావు పోడనూరులోని ‘జోనల్‌ సిగ్నల్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ను తనిఖీ చేశారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ట్రైనింగ్‌ సెంటర్‌లో పలు కొత్త సౌకర్యాలను ప్రారంభించడంతో పాటు కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. స్వదేశీ రైలు రక్షణ వ్యవస్థకు సంబంధించిన ‘కవచ్‌ ల్యాబ్‌’, ఐపీ–ఆధారిత ఇంటీగ్రేటెడ్‌ ప్యాసింజర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ల్యాబ్‌, అన్ని తరగతి గదుల్లో స్మార్ట్‌ ఇంటరాక్టివ్‌ ప్యానెళ్లను జీఎం ప్రారంభించారు.

కొత్త భవనాలకు శంకుస్థాపన: పురుషుల హాస్టల్‌ , కంప్యూటర్‌ ఆధారిత పరీక్షా హాలు, అవుట్‌డోర్‌ యార్డ్‌లో సిగ్నలింగ్‌ మోడల్‌ రూమ్‌ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.శిక్షణ పొందే అభ్యర్థుల రికార్డులను డిజిటలైజ్‌ చేసే ఐటీఎమ్‌ఎస్‌ వెబ్‌ పోర్టల్‌ను, సైబర్‌ సెక్యూరిటీ అవగాహన పోస్టర్లు , సాంకేతిక సమాచార పత్రాలను ఆవిష్కరించారు.

అవార్డుల ప్రదానం: 2024, 2025 సంవత్సరాలకు గానూ ఉత్తమ శిక్షణార్థి అవార్డులను ప్రతిభావంతులకు అందజేసారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతు.. భద్రతకు సంబంధించిన కీలకమైన సాంకేతిక పనులలో సిబ్బంది ఎలాంటి ‘షార్ట్‌కట్స్‌’ తీసుకోకూడదని స్పష్టం చేశారు. ఫీల్డ్‌ వర్కర్ల కోసం ఏ ఐఆధారిత సమస్యల పరిష్కార యాప్‌ , సాంకేతికతలతో లీనమయ్యేలా శిక్షణ ఇవ్వాలని సూచించారు.

పోడనూరు కేంద్రం ప్రత్యేకత

1960 నుండి సేవలందిస్తున్న పోడనూరు శిక్షణ కేంద్రం సదరన్‌, సౌత్‌ వెస్ట్రన్‌ రైల్వే సిబ్బందికి శిక్షణనిస్తోంది. 2024 నుండి ఇప్పటివరకు 622 మంది సిబ్బందికి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘కవచ్‌’ వ్యవస్థపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సదరన్‌ రైల్వే ప్రిన్సిపల్‌ చీఫ్‌ సిగ్నల్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ ఇంజనీర్‌ విజయ్‌ సింగ్‌ మీనా, సేలం డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ పన్నా లాల్‌ , ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement