సాక్షి,చైన్నె: కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ తమిళనాడు విభాగం పేతురుత్వంలో ‘ఇంటెలిజెంట్ హెల్త్‌కేర్– ఫ్రమ్ ఇన్నోవేషన్ టు ఇంప్లిమెంటేషన్‘ (ఆరోగ్య సంరక్షణలో కత్రిమ మేధ: ఆవిష్కరణ నుండి అమలు వైపు) అనే అంశంపై ఆరవ ఎడిషన్ ‘సిఐఐ తమిళనాడు మెడ్‌క్లేవ్ 2026’ సదస్సును చైన్నెలో జరిగింది. ఆరోగ్య సంరక్షణ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , డిజిటల్ సాంకేతికతలను ఉపయోగించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు విధానకర్తలు, పరిశ్రమల అధిపతులు, వైద్య నిపుణులు , విద్యావేత్తలు ఈ సదస్సులో భాగస్వాములయ్యారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తమిళనాడు ప్రభుత్వ ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్ దారేజ్ అహ్మద్ మాట్లాడుతూ, దేశంలోనే అత్యంత పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థ కలిగిన రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటని పేర్కొన్నారు. ప్రభుత్వ , ప్రైవేట్ రంగాల భాగస్వామ్యంతో రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ ,మానసిక ఆరోగ్య సమస్యల వంటి ఆధునిక వైద్య సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. సీఐఐ తమిళనాడు ఛైర్మన్ సి. దేవరాజన్ మాట్లాడుతూ, ఆరోగ్య సంరక్షణ అనేది కేవలం సామాజిక సేవ మాత్రమే కాకుండా, ఆర్థిక వద్ధి, ఉపాధి , పెట్టుబడులకు కీలకగా మారిందన్నారు. 2036 నాటికి 1.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలనే తమిళనాడు లక్ష్యానికి ఈ రంగం ఎంతో దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. సీఐఐ తమిళనాడు హెల్త్‌కేర్ ప్యానెల్ కన్వీనర్ డాక్టర్ సతీష్ దేవదాస్ మాట్లాడుతూ, నూతన వైద్య ఆవిష్కరణలు, ఏఐ సాంకేతికతలు కేవలం పెద్ద నగరాలకే పరిమితం కాకుండా టైర్–2, టైర్–3 నగరాలలోని ఆసుపత్రులకు కూడా అందుబాటు ధరలో రావాలని ఉద్ఘాటించారు.
డాక్టర్ ఆర్.వి. రమణికి ’లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
సామాజిక నేత్ర సంరక్షణ, అంధత్వ నిర్మూలనకు చేసిన విశేష కషికి గాను శంకర ఐ ఫౌండేషన్ – ఇండియా వ్యవస్థాపకుడు , మేనేజింగ్ ట్రస్టీ పద్మశ్రీ డాక్టర్ ఆర్.వి. రమణి కి ‘సిఐఐ జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు. తమిళనాడు ప్రభుత్వ ఆరోగ్య కార్యదర్శి డాక్టర్ దారేజ్ అహ్మద్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. పురస్కారాన్ని స్వీకరించిన అనంతరం డాక్టర్ రమణి మాట్లాడుతూ.. రాజీపడని నైతిక విలువలు, స్పష్టమైన లక్ష్యాలే శంకర ఫౌండేషన్‌ను జాతీయ ఉద్యమంగా తీర్చిదిద్దాయని అన్నారు. ఈ సదస్సులో సీఐఐ తమిళనాడు డైరెక్టర్ శ్ర బి. జైకష్ణన్, హెల్త్‌కేర్ ప్యానెల్ కో–కన్వీనర్ డాక్టర్ ప్రవీణ్ రాజ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.


