పేచిపరై డ్యామ్‌కు గ్లోబల్‌ అవార్డు | - | Sakshi
Sakshi News home page

పేచిపరై డ్యామ్‌కు గ్లోబల్‌ అవార్డు

Oct 25 2026 1:17 AM | Updated on Oct 25 2026 1:17 AM

కొరుక్కుపేట: కన్యాకుమారి జిల్లాలో ఉన్న పేచిపరై డ్యామ్‌ 2026 సంవత్సరానికి ప్రపంచ వారసత్వ నీటిపారుదల నిర్మాణంగా ఎంపికై ంది. ఈ సందర్భంగా సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో అంతర్జాతీయ నీటిపారుదల పారుదల కమిషన్‌ అందించిన అవార్డు, సర్టిఫికెట్‌ను మంత్రి ఎన్‌. ఆనంద్‌ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా జలవనరుల శాఖ అధికారులు ఆయనను అభినందించారు. ఈ కార్యక్రమానికి జలవనరుల శాఖ ప్రభుత్వ కార్యదర్శి ప్రశాంత్‌ ఎం. వదనేరే, జలవనరుల శాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఇంజనీర్‌ అండ్‌ చీఫ్‌ ఇంజనీర్‌ (జనరల్‌) ఎస్‌. గోపాలకృష్ణన్‌ , స్టేట్‌ డ్యామ్‌ సేఫ్టీ ఇంజనీర్‌ ఎస్‌. రమేష్‌, నాగర్‌కోయిల్‌–కొడైయూర్‌ బేసిన్‌ డివిజన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఎ. వసంతి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ 100 సంవత్సరాల కంటే ఎక్కువ పురాతనమైన నీటిపారుదల నిర్మాణాలలో, నీటిపారుదల వ్యవసాయం, ఇంజనీరింగ్‌ టెక్నాలజీ, ఆహార ఉత్పత్తి, రైతుల సామాజిక–ఆర్థిక అభివృద్ధికి గణనీయమైన కృషి చేసిన నిర్మాణాలను అంతర్జాతీయ నీటిపారుదల , జలవనరుల కమిషన్‌ గుర్తించింది. పేచిపరై ఆనకట్ట, దాని చారిత్రక ప్రాముఖ్యత, నీటిపారుదల రంగంలో దాని సహకారం నీటి వనరుల నిర్వహణలో దాని ప్రాముఖ్యతకు గుర్తింపుగా 2026 నాటికి ప్రపంచ వారసత్వ నీటిపారుదల నిర్మాణంగా ఎంపిక చేయబడిందని వెల్లడించారు ఫ్రాన్స్‌లోని మార్సెయిల్‌లో జరిగిన 77వ అంతర్జాతీయ వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశంలో ఈ అవార్డు, సర్టిఫికెట్‌ను ప్రదానం చేశారు. తమిళనాడు జలవనరుల నిర్వహణ వారసత్వానికి, దాని చిరకాల నీటిపారుదల మౌలిక సదుపాయాల శ్రేష్ఠతకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించడం గర్వకారణం అని సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement