మర్యాదపూర్వక భేటీ | - | Sakshi
Sakshi News home page

మర్యాదపూర్వక భేటీ

Oct 25 2026 1:17 AM | Updated on Oct 25 2026 1:17 AM

సాక్షి,చైన్నె : తమిళనాడు రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్‌గా నియమితులైన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కె. ఫణీంద్ర రెడ్డితో పాటూ సభ్యులు చైన్నెలోని సచివాలయంలో ముఖ్యమంత్రి విజయ్‌ను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో కొనుగోలుదారులు, విక్రేతల ప్రయోజనాలను పరిరక్షించడానికి, నివాస, వాణిజ్య ఆస్తుల లావాదేవీలను నియంత్రించడానికి స్థిరాస్తి నియంత్రణ అథారిటీ పనిచేస్తోంది. ఈక్రమంలో తమిళనాడు ప్రభుత్వం టీఎన్‌ రెరా నిర్వహణ కమిటీలో కొన్ని మార్పులు చేస్తూ ఇటీవల కొత్త ఆదేశాలను జారీ చేసింది. చైర్మన్‌గా కె. ఫణీంద్ర రెడ్డి (రిటైర్డ్‌ ఐఏఎస్‌), సభ్యులుగా రీటా హరీష్‌ ఠాకూర్‌ (రిటైర్డ్‌ ఐఏఎస్‌), మైథిలి కె. రాజేంద్రన్‌ (రిటైర్డ్‌ ఐఏఎస్‌), ఎస్‌. కపాకరన్‌ మధురం (రిటైర్డ్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి), కె.పి. సత్యమూర్తి (రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజినీర్‌)తో కొత్త కమిటీ పునర్వ్యవస్థీకరణ చేశారు. ఈ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో చైర్మన్‌ కె. ఫణీంద్ర రెడ్డి నాయకత్వంలోని సభ్యుల బృందం ముఖ్యమంత్రి విజయ్‌ను కలిసి అభినందనలు అందుకోవడంతో పాటు పలు అంశాలపై చర్చించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement