3 నెలల పసికందును రోడ్డుపై వదిలేసిన తల్లి | - | Sakshi
Sakshi News home page

3 నెలల పసికందును రోడ్డుపై వదిలేసిన తల్లి

Oct 24 2026 4:59 AM | Updated on Oct 24 2026 4:59 AM

సాక్షి చైన్నె: అప్పుల సమస్యలు, ప్రైవేట్‌ రుణాల వాయిదాల ఒత్తిడి తట్టుకోలేక ఒక తల్లి తన మూడు నెలల పసికందును నడిరోడ్డుపై వదిలేసిన హృదయ విదారక ఘటన తమిళనాడులోని కరూర్‌లో వెలుగు చూసింది. కరూర్‌ ఉళవర్‌ మార్కెట్‌ ప్రాంతానికి చెందిన కార్తి(28), సీతాలక్ష్మి(24) దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో మొదటి కుమార్తె లక్షణను సీతాలక్ష్మి తల్లి, రెండవ కుమార్తె తమిళినిని ఆమె సోదరి ప్రవీణ సాకుతున్నారు. మూడో కుమార్తె మూడు నెలల పసికందు షష్టికను సీతాలక్ష్మి తన వద్దే ఉంచుకుని పెంచుతోంది. కార్తి కూరగాయల వ్యాపారంతో పాటు చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ కుటుంబం ప్రైవేట్‌ ఆర్థిక సంస్థలు, మహిళా స్వయం సహాయక బృందాల నుంచి భారీగా అప్పులు చేసింది. నిర్ణీత సమయానికి వాయిదాలు చెల్లించకపోవడంతో రుణదాతల నుంచి తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం రుణ వాయిదాను చెల్లించాలంటూ స్వయం సహాయక బృందం సభ్యులు గురువారం రాత్రి వారిని ఒత్తిడి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన సీతాలక్ష్మి ఉళవర్‌ మార్కెట్‌ నుంచి పాత బస్టాండ్‌కు వెళ్లే ప్రధాన రోడ్డుపై తన మూడు నెలల పసికందును వదిలేసి వెళ్లిపోయింది. నడిరోడ్డుపై పసిబిడ్డ ఉండడాన్ని గమనించిన స్థానికులు సీతాలక్ష్మిని అడ్డుకున్నారు. బాలల సంరక్షణ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించారు. కరూర్‌ నగర పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. తల్లి, బిడ్డను బాలల సంరక్షణ సహాయ కేంద్రానికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement