నమ్మ హెల్త్‌ మెగా ఎక్స్‌పో 2026 ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

నమ్మ హెల్త్‌ మెగా ఎక్స్‌పో 2026 ప్రారంభం

Oct 18 2026 2:18 AM | Updated on Oct 18 2026 2:18 AM

సాక్షి, చైన్నె: తాంబరంలోని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ తన స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా నమ్మ హెల్త్‌ మెగా ఎక్స్‌పో 2026 ఏర్పాటు చేసింది. శనివారం తాంబరం జీఎస్‌టీ రోడ్డులోని వల్లూవర్‌ గురుకులం పాఠశాల ప్రాంగణంలో ఈ ఎక్స్‌పో ఘనంగా ప్రారంభమైంది. సోమవారం వరకు కొనసాగే ఈ మెగా ఎక్స్‌పోను చెంగల్పట్టు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎం. వీరప్పన్‌ , ఐఎంఏ ప్రధాన కార్యాలయ గౌరవ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై న డాక్టర్‌ కె.ఎం. అబుల్‌ హసన్‌ ప్రారంభించారు.ఈ హెల్త్‌ ఎక్స్‌పోలో ప్రాథమిక వైద్య శాస్త్రాల నుంచి న్యూరాలజీ, ప్రసూతి – గైనకాలజీ, కార్డియాలజీ వంటి సూపర్‌–స్పెషాలిటీ రోగాల వరకు 26 థీమ్డ్‌ పెవిలియన్లను ఏర్పాటు చేశారు. 6 వైద్య కళాశాలలు, 50కి పైగా ఆసుపత్రులు , సుమారు 400 మంది ప్రముఖ వైద్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ ఎక్స్‌పోకు దాదాపు 30,000 మందికి పైగా సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నారు.

హెల్త్‌ కొలువు :

నవరాత్రి సాంస్క్కృతిక సంప్రదాయాన్ని ఆరోగ్య సంరక్షణతో సృజనాత్మకంగా మేళవిస్తూ స్థానిక ప్రజల భాగస్వామ్యంతో రూపొందించిన 52.8 అడుగుల ఎత్తైన హెల్త్‌ కొలువు ఈ ఎక్స్‌పోలోనే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ ఆరోగ్యకొలువుకు సంబంధించి ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ , ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సర్టిఫికేట్లను ఈనెల 19న జరిగే ముగింపు వేడుకల్లో బహుకరించనున్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ తాంబరం అధ్యక్షురాలు డాక్టర్‌ ఎల్‌. యశోద, కన్వీనర్‌ డాక్టర్‌ టి.ఎన్‌. రవిశంకర్‌, కార్యదర్శి డాక్టర్‌ వి.ఎస్‌. హరిహరన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement