తమిళసినిమా: 8 తోట్టాగళ్ చిత్రంతో మంచి విజయాన్ని అందుకుని గుర్తింపు పొందిన నటుడు వెట్ట్రి. వైవిధ్య భరిత కథా చిత్రాలకు కేరాఫ్‌గా మారిన ఈయన తాజాగా కథా నాయకుడిగా నటిస్తున్న చిత్రానికి పరీడ్ అనే డి టైటిల్‌ను ఖరారు చేశారు. డ్రీమ్ హౌస్, జైన్ క్రియేషన్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి హరున్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకుముందు దెబ్బ అని చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో కథానాయకిగా హైదరాబాద్‌కు చెందిన అక్షిత నటిస్తున్నారు. సింగం పులి, శరవణన్ సుబ్బయ్య, లబ్బర్ బంతు జాన్సన్ దివాకర్, కోడంగి వడివేలు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని జాన్ రాబిన్సన్, ఛాయాగ్రహణంను కెవీ.కిరణ్ అందిస్తున్నారు. చిత్ర దర్శకుడు మీడియాతో మాట్లాడుతూ ఇందులో నటుడు వెట్ట్రి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా నటిస్తున్నారని తెలిపారు. ఆ వృత్తిలో ఆయన ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు.. కుటుంబం ఎలా బాధింపునకు గురైంది.. చివరకు అతను అందులోంచి ఎలా బయటపడగలిగాడు ? వంటి పలు ఆసక్తికరమైన వివరాలతో రూపొందిస్తున్న ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కథా చిత్రం పరీడ్ అని చెప్పారు. పోలీస్ ఇతివృత్తంతో సాగే ఒక పవర్ఫుల్ పాటను దర్శకుడు అరుణ్ రాజా కామరాజ్ పాడినట్లు చెప్పారు. చైన్నె, కోయంబత్తూర్, ఏర్కాడు, కొడైక్కానల్ ప్రాంతాల్లో షూటింగ్‌ను నిర్వహించి పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శుక్రవారం నిర్మాత ఎస్సార్ ప్రభు, దర్శకుడు ఎస్సార్ ప్రభాకర్, నటుడు ఆరి అర్జనా సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేశారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.


