శివమొగ్గ: కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ జిల్లాలోని భద్రావతి విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీ (వీఐఎస్‌ఎల్)లో డీజీఎంగా పనిచేస్తున్న గోవిందరాజు (54) ఆత్మహత్య చేసుకున్నారు. గోవిందరాజు గత 8 ఏళ్లుగా వీఐఎస్‌ఎల్ ఫ్యాక్టరీలో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా ఉంటూ, క్వార్టర్స్‌లో ఒంటరిగా ఉంటున్నారు. ఆయన స్వస్థలం తమిళనాడులోని సేలం జిల్లా, ఆయన కుటుంబం సేలంలోనే నివసిస్తోంది. గోవిందరాజు భార్య రెండు రోజుల క్రితమే భద్రావతికి వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు భార్యను రైలులో సొంతూళ్లో వదిలి ఆయన తిరిగి వచ్చారు. సోమవారం ఉదయం పేపర్ బాయ్ వెళ్లినప్పుడు ఉరికి వేలాడుతూ కనిపించాడు. దీంతో ఫ్యాక్టరీ అధికారులు, స్థానిక పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కుటుంబానికి సమాచారం ఇచ్చారు. ఆత్మహత్యకు కారణం ఉద్యోగంలో సమస్యలా, కుటుంబంలో ఇబ్బందులా అనేది తేలాల్సి ఉంది.


