కొరుక్కుపేట: తమిళనాడు సెకండరీ హెల్త్‌కేర్ కార్యకర్తలు సోమవారం చైన్నె ఎగ్మోర్‌లోని రాజరత్నం స్టేడియం సమీపంలో నిరాహార దీక్ష చేపట్టారు. శాశ్వత ఉపాధి, ఉద్యోగ భద్రత, చెల్లించాల్సిన బకాయిలు, వేతన పెంపు వంటి డిమాండ్లతో ఈ నిరసన సాగింది. తమిళనాడు వ్యాప్తంగా ఉన్న కేంద్రాలు, సహాయక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో డిప్లొమా, బీఎస్సీ నర్సింగ్ డిగ్రీలు కలిగిన 2000 మందికి పైగా నర్సులు పనిచేస్తున్నారు. తమిళనాడు నలుమూలల నుండి నర్సులు ధ్యాన భంగిమలో కూర్చుని అందరి దృష్టిని ఆకర్షించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సుందరి, రాష్ట్ర కార్యదర్శి జయ సూర్య, కోశాధికారి సూర్య నేతృత్వంలో ఈ నిరాహార దీక్ష సాగింది. రాష్ట్ర అధ్యక్షురాలు సుందరి మాట్లాడుతూ తాము తమిళనాడులోని 4,848 సంక్షేమ కేంద్రాలలో పనిచేస్తున్నాం. ఆరోగ్య కేంద్రాలలో నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు వీలుగా ఆరోగ్య విభాగం ఉద్యోగులను శాశ్వతం చేయాలని కోరారు.


