మధురాంతకం, ధారాపురం ఉప ఎన్నికల ప్రచారం వేడెక్కింది. టీవీకే, డీఎంకే, అన్నాడీఎంకే, వామపక్షాలు, నామ్‌ తమిళర్‌ కట్చిల అభ్యర్థులు, వారి మద్దతు ముఖ్య నేతలు, పార్టీల అధినేలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. భానుడి సెగను సైతం లెక్క చేయకుండా ఓట్ల వేటలో అభ్యర్థులు పరుగు | - | Sakshi
Sakshi News home page

మధురాంతకం, ధారాపురం ఉప ఎన్నికల ప్రచారం వేడెక్కింది. టీవీకే, డీఎంకే, అన్నాడీఎంకే, వామపక్షాలు, నామ్‌ తమిళర్‌ కట్చిల అభ్యర్థులు, వారి మద్దతు ముఖ్య నేతలు, పార్టీల అధినేలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. భానుడి సెగను సైతం లెక్క చేయకుండా ఓట్ల వేటలో అభ్యర్థులు పరుగు

Sep 27 2026 3:28 AM | Updated on Sep 27 2026 3:28 AM

మధురాంతకంలో పళణి రోడ్‌ షో

ధారాపురంలో దూసుకెళ్లిన ఉదయ నిధి

ఓటింగ్‌ ఏర్పాట్లు ముమ్మరం

మధురాంతకంలో మంత్రి ఆనంద్‌ ఓట్ల వేట

మధురాంతకంలో

పళణి స్వామి ప్రచారం

దారాపురంలో ఉదయనిధి

సాక్షి, చైన్నె : మధురాంతకం (ఎస్సీ), ధారాపురం (ఎస్సీ) నియోజకవర్గాల ఉప ఎన్నికల అక్టోబరు 6వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. టీవీకే తరపున మధురాంతకంలో మరగతం కుమర వేల్‌, డీఎంకే తరపున పరంథామన్‌, అన్నాడీఎంకే తరపున కనిత సంపత్‌, సీపీఎం తరపున సుగంధి, నామ్‌ తమిళర్‌ కట్చి తరపున జానకీరామన్‌లు పోటీలో ఉన్నారు.ఇక, ధారపురంలో టీవీకే తరపున సత్యభామ, డీఎంకే అభ్యర్థిగా సుకన్య, అన్నాడీఎంకే అభ్యర్థిగా భానుమతి,నామ్‌ తమిళర్‌ కట్చి అభ్యర్థిగా కార్తిక, సీపీఐ అభ్యర్థిగా లక్ష్మణన్‌ పోటీ చేస్తున్నారు. ఈ ఐదు ప్రధాన పార్టీల మధ్య తాజాగా సమరం నెలకొనడంతో పోటీ రసవత్తరంగా సాగుతోంది.

ప్రచారం ముమ్మరం

ఓటర్లను ఆకర్షించే దిశగా అధికార టీవీకే వ్యూహాలు రచిస్తోంది.శుక్రవారం మధురాంతకంలో సీఎం విజయ్‌ ప్రచార సభ నింపిన ఉత్సాహంతో మంత్రులు నియోజకవర్గాలలో దూసుకెళ్తున్నారు. మంత్రి ఆనంద్‌, ఆదవ్‌ అర్జున, అరుణ్‌ రాజ్‌, రాజ్‌కుమార్‌ తదితర కీలక మంత్రులతో కలిసి ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు వీధి వీధిన తిరుగుతూ విజయ్‌ చరిష్మాతో ఓటర్లను ఆకర్షించే పనిలో నిమగ్నమాయ్యరు. అలాగే వీసీకే, కాంగ్రెస్‌, ఎండీఎంకే నాయకులు సైతం వీరితో కలిసి ఉరకలు తీస్తున్నారు. ఇక సీఎం విజయ్‌ తదుపరి ధారాపురంలో పోటీచేస్తున్న తమ అభ్యర్థి సత్యభామకు మద్దతుగా 30న బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అలాగే అక్టోబర్‌ 4న జరిగే భారీ రోడ్‌ షోలో కూడా ఆయన పాల్గొంటారు. ఇక, మధురాంతకంలో డీఎంకే అభ్యర్థి పరందామన్‌ తన దైన శైలిలో వ్యాఖ్యల తూటాలను పేల్చుతూ, ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. పార్టీ కీలక నేతలు నియోజకవర్గంలో తిష్ట వేసి ఓట్ల వ్యూహాలు రచించే పనిలో పడ్డారు. ఇక, మధురాంతకంలో అన్నాడీఎంకే అభ్యర్థి కనిత సంపత్‌కు మద్దతుగా శనివారం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ఓపెన్‌ టాప్‌ వాహనం ద్వారా గ్రామ గ్రామాన రోడ్‌ షో తరహాల చక్కర్లు కొడుతూ, అక్కడక్కడ జనం గుమ్మికూడిన చోట అధికార టీవీకేకు వ్యతిరేకంగా, తమను మోసం చేసి పదవికి రాజీనామా చేసిన టీవీకే అభ్యర్థి మరకదం కుమర వేల్‌ తీరను దుయ్యబట్టే రీతిలో ప్రసంగాలను హోరెత్తించారు. ఆదివారం కూడా ఆయన ఈ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అనంతరం 28, 29 తేదీలో ధారపురంలో పోటీచేస్తున్న తమ అభ్యర్థి భానుమతికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు. ఇక, సీపీఎం నేత షన్ముగం తమ అభ్యర్థికి మద్దతుగా గ్రామ గ్రామన తిరుగుతూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంచేశారు. నామ్‌ తమిళర్‌ కట్చి నేత సీమాన్‌ వీధి సభల రూపంలో ఓటర్ల మద్దతు సేకరిస్తున్నారు. ఇక, డీఎంకే యువజన నేత ఉదయ నిధిస్టాలిన్‌ తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ధారాపురంలో తమ అభ్యర్థి సుకన్య మద్దతు గా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీవీకే సర్కారుపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతూ వ్యాఖ్యల తూటాలను పేల్చారు.నామ్‌ తమిళర్‌ కట్చి సమన్వయకర్త సీమాన్‌, కమ్యూనిస్ట్‌ పార్టీల నాయకులు కూడా ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయడంతో ధారపురం రాజకీయంగా అత్యంత కీలక ప్రాంతంగా మారింది. అలాగే, 29న కనిమొళి నేతృత్వంలో మదురాంతకంలో , అక్టోబరు 3న స్టాలిన్‌ నేతృత్వంలో ప్రచార సభలు జరగనున్నాయి. ఇక, పుదుచ్చేరి తట్టాన్‌ చావడి ఉప ఎన్నికల ప్రచారం సైతం ఊపందుకుంది.

నేతల సుడిగాలి పర్యటన

రంగంలోకి పారా మిలటరీ

మధురాంతకం, ధారపురం శాసనసభ నియోజకవర్గాలకు ఎన్నికల వాతావరణం వేడెక్కడంతో భద్రతా పరంగా పారా మిలటరీని రంగంలోకి దించేందుకు ఎన్నికల కమిషన్‌ సిద్ధమైంది. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. ధారపురం నియోజకవర్గంలో ఎన్నికల భద్రతా చర్యల్లో భాగంగా పారామిలిటరీ సిబ్బందితో సహా 500 మందికి పైగా మోహరించారు. ఓటర్లకు డబ్బు, కానుకల పంపిణీని అడ్డుకోవడానికి ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ల దాడులు కూడా ఊపందుకున్నాయి. అలాగే సీఎం ప్రచారర్యాలీ, రోడ్‌ షోలు జరగనున్న ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లకు సిద్ధమయ్యారు. కీలక పోలింగ్‌ కేంద్రాల వద్ద సీసీటీవీ నిఘా, గస్తీని పెంచారు. ఇక, మైక్రో–అబ్జర్వర్ల సైతం రంగంలోకి దిగారు. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణలో భాగంగా, పోలింగ్‌ కేంద్రాలను పర్యవేక్షించే అధికారులకు ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు, నేషనల్‌ బ్యాంకుల్లో పనిచేస్తున్న గ్రూప్‌–సి స్థాయికి తక్కువ అధికారులను మైక్రో–అబ్జర్వర్లుగా నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement