ఎంకే స్టాలిన్‌కు ఫీవర్‌ | - | Sakshi
Sakshi News home page

ఎంకే స్టాలిన్‌కు ఫీవర్‌

Sep 16 2026 3:43 AM | Updated on Sep 16 2026 3:43 AM

– డీఎంకే ముప్పెరుమ్‌ విళా వాయిదా

సాక్షి, చైన్నె: డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ అకస్మాత్తుగా జ్వరం బారినపడ్డారు. ఫలితంగా మంగళవారం సాయంత్రం జరగాల్సిన డీఎంకే ముప్పెరుమ్‌ విళా వాయిదా పడింది. డీఎంకే నేతృత్వంలో ఏటా సెప్టెంబర్‌ 15వ తేదీన పార్టీ ఆవిర్భావ వేడుక, దివంగత నేతలు అన్నా,పెరియార్‌జయంతి వేడుకలు నిర్వహించడం జరుగుతోంది. ఈ మేరకు మంగళవారం ఈ వేడుక జరగాల్సి ఉంది. ఈ పరిస్థితులలో ఉదయం డీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమురుగన్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ జ్వరంతో బాధపడుతున్న కారణంగా, సాయంత్రం చైన్నె – అన్నా అరివాలయంలోని కలైజ్ఞర్‌ అరంగ్‌లో నిర్వహించాల్సి ఉన్న ముప్పెరుమ్‌ విళా వాయిదా వేసినట్టు ప్రకటించారు. ఈ వేడుకలను నిర్వహించే కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు.

ప్రకటించిన పురస్కారాలు: ఈ వేడుకలకు సంబంధించి వివిధ విభాగాల్లో 2026 సంవత్సరానికి గాను పురస్కార గ్రహీతలను ప్రకటించారు. ఈ మేరకు పెరియార్‌ అవార్డు– రైతు విభాగం డిప్యూటీ సెక్రటరీ చెల్లప్ప, అన్నా అవార్డు – సేలం సెంట్రల్‌ జిల్లా ప్రెసిడెంట్‌ సేలం జి.కె. సుభాష్‌, కలైజ్ఞర్‌ అవార్డు– పార్టీ డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ తిరుచ్చి శివా, పావేందర్‌ అవార్డు– మెడికల్‌ వింగ్‌ ప్రెసిడెంట్‌ కనిమొళి ఎన్‌.వి.ఎన్‌. సోము, పేరాసిరియర్‌ అవార్డు– హై పవర్‌ వర్కింగ్‌ కమిటీ మెంబర్‌ మిసా ఎస్‌. అహ్మద్‌ తంబి, ఎంకే స్టాలిన్‌ అవార్డు – యువజన విభాగం డిప్యూటీ సెక్రటరీ ఎన్‌ ఇళయరాజా,మురసోలి సెల్వం అవార్డు– ప్రముఖ జర్నలిస్ట్‌, రచయిత పి. తిరుమావేలన్‌లను ఎంపిక చేశారు.ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయిన తరుణంలో, స్టాలిన్‌ అనారోగ్యం కారణంగా చివరి నిమిషంలో వేడుకలు వాయిదా పడటంతో డీఎంకే శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.

మంత్రి ఆధవ్‌ అర్జున

పరువు నష్టం దావా

– స్టాలిన్‌ తరఫున వివరణకు 21 వరకు గడవు

సాక్షి,చైన్నె: రూ. కోటి పరువు నష్టం చెల్లించాలని కోరుతూ మంత్రి ఆధవ్‌ అర్జున దాఖలు చేసిన పిటిషన్‌పై సమాధానం ఇచ్చేందుకు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ తరఫు న్యాయవాదులకు మద్రాసు హైకోర్టు సెప్టెంబర్‌ 21 వరకు గడువు ఇచ్చింది. రూ. 258 కోట్ల డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ కేసులో నిందితుడిగా ఉన్న జాన్‌ బ్రిటో మంత్రి ఆధవ్‌ అర్జునకు బంధువు అని పేర్కొంటూ మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్‌ తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, జాన్‌ బ్రిటో తనకి ఎలాంటి బంధువు కాదని, తన పరువుకు భంగం కలిగించేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆధవ్‌ అర్జున మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. స్టాలిన్‌ , డీఎంకే ఐటీ విభాగం ఈ పోస్టులను తొలగించాలని, తనకు రూ. కోటి పరువు నష్టం చెల్లించాలని ఆయన కోరారు.

హైకోర్టు ఆదేశాలు: ఈ కేసు మంగళవారం జస్టిస్‌ గోవిందరాజన్‌ తిలగవతి ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. స్టాలిన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది విల్సన్‌ వాదనలు వినిపిస్తూ, కౌంటర్‌ దాఖలు చేయడానికి సెప్టెంబర్‌ 21 వరకు సమయం కావాలని కోరారు. దీనిని అంగీకరించిన న్యాయమూర్తి, విచారణ వాయిదా వేశారు.

రామకృష్ణ మిషన్‌ ఆశ్రమంలో అల్యూమ్ని డే

సాక్షి, చైన్నె : టీ.నగర్‌లోని రామకృష్ణ మిషన్‌ ఆశ్రమ పాఠశాలల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ‘గ్రాండ్‌ అల్యూమ్ని డే 2026 వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈనెల 20వ తేది ఆదివారం మధ్యాహ్నం చైన్నె టీ.నగర్‌, బజుల్లా రోడ్డులోని శ్రీ రామకృష్ణ మిషన్‌ బాయ్స్‌ స్కూల్‌ ఇన్ఫోసిస్‌ హాల్‌లో ఈవేడుక జరగనుంది. ఈ వేడుకలో దాదాపు 1,000 మంది పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, అభిమానులు ఒకే వేదికపైకి రానున్నారు. తమ మాతృ సంస్థతో అనుబంధాన్ని పునరుద్ధరించుకోవడానికి, పాఠశాల విశిష్టమైన వారసత్వాన్ని స్మరించుకోవడానికి ఈ వార్షిక వేడుక ఒక ప్రత్యేక వేదికగా నిలవనుంది. ఈ సారి కార్యక్రమంలో భాగంగా సమాజానికి విశేష సేవ లు అందించిన పలువురు ప్రముఖ పూర్వ విద్యా ర్థులను సత్కరించనున్నారు. వీరిలో మేజర్‌ జన రల్‌ ఎస్‌. వెంకటరామన్‌, మహాకవి సుబ్రహ్మణ్య భారతి ముని మనవడు రాజ్‌కుమార్‌ భారతి, ప్రముఖ పిడియాట్రీషియన్‌ డాక్టర్‌ భాస్కర్‌ రాజు ఉన్నారు.కాగా ఈ విద్యాసంస్థలో చదివిన ఎందరో ప్రముఖులు దేశ విదేశాల్లో విశేష గుర్తింపు సాధించారు. ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ డాక్టర్‌ వై.వి. రెడ్డి భారత ఆర్మీ మాజీ చీఫ్‌ జనరల్‌ సుందర్జీ, ఐఎఎస్‌ శంకర్‌. అంతర్జాతీయ టెన్నిస్‌ క్రీడాకారుడు రామనాథన్‌ కృష్ణన్‌, నటకరంగానికి చెందిన నటుడుఆర్‌.ఎస్‌. మనోహర్‌, పద్మభూషణ్‌ నల్లి కుప్పుస్వామి చెట్టి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement