సాక్షి, చైన్నె: లండన్ పర్యటనలో ఉన్న సీఎం ఎస్. జోసెఫ్ విజయ్ సమక్షంలో తమిళనాడు రాష్ట్రంలో వేల కోట్ల పెట్టుబడులు, వేలాది ఉద్యోగావకాశాలను కల్పించే పలు కీలక అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఈ వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రముఖ సంవర్ధన మదర్‌సన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ తన ఐరోపా, బ్రిటన్ భాగస్వామ్య సంస్థలతో కలిసి తమిళనాడు గైడెన్స్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. పెట్టుబడిగా రూ. 11,000 కోట్లు, డిజైన్, ఇంజినీరింగ్, తయారీ, అసెంబ్లీ మరియు లాజిస్టిక్స్ రంగాలలో 7,000 మందికి ఉద్యోగావకాశాల కల్పించనున్నది. ఈ ఒప్పందంపై మదర్‌సన్ గ్రూప్ గ్లోబల్ మార్కెటింగ్ హెడ్ బారీ పెయింటర్, గైడెన్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ జే సంతకాలుచేశారు. గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు విస్తరణ, తమిళనాడులో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల విస్తరణకు సంబంధించి రెండు ఒప్పందాలు ఇందులో కుదిరాయి. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ గ్లోబల్ కమ్యూనికేషన్స్ సంస్థ, ఆర్‌న్సట్ – యంగ్ తో కలిసి చైన్నె మౌంట్ పూంద మల్లి రోడ్డులోని జీసీసీ కారిడార్‌లో కొత్త సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా రూ. 1,000 కోట్ల పెట్టుబడితో 2,000 పైగా ఉన్నత స్థాయి ఉద్యోగాలు రానున్నాయి. అలాగే సిగ్మా టెక్నాలజీ గ్రూప్ (స్వీడన్) సంస్థ తన భారత భాగస్వామి శ్రియా సొల్యూషన్స్ ద్వారా తిరుచ్చి, చైన్నెలోని సెంటర్లను విస్తరించనుంది. ఎంబెడెడ్ సిస్ట మ్స్, డిజిటలైజేషన్ రంగాలలో 600 ఉన్నత స్థాయి ఉద్యోగాలను సృష్టించనుంది. విల్సన్ పవర్ సొల్యూ షన్స్ ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్ తయారీ రంగం విస్తరణ లో భాగంగా విల్సన్ పవర్ సొల్యూషన్స్ సంస్థతో ఒప్పందం కుదిరింది. తిరువళ్లూర్ జిల్లాలో రూ. 300 కోట్ల పెట్టుబడి, 400 మందికి కొత్తగా ఉద్యోగావకాశా లు కల్పించనున్నారు. ఈ కార్యక్రమాలలో బ్రిటన్‌లో భారత రాయబారి కుమరన్ పెరియసామి, గైడెన్స్ ఎండీ దీపక్ జే వివిధ కంపెనీల సీఈఓలు, తమిళనా డు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముందు గా సీఎం ఎస్.జోసెఫ్ విజయ్‌ను ప్రముఖ అశోక్ లేలాండ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ధీరజ్ హిందూజా, ఫినో లెక్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ప్రకాష్ బి. ఛాబ్రి యా, డైరెక్టర్ రీటా హిందూజా ఛాబ్రియాలు మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా, సీఎం విజయ్, సినీ నటుడు అజిత్‌తో కలిసి తీసుకున్న పలు వీడియోలో సామాజిక మధ్యమాలలో వైరల్‌గా మారాయి.


