తిరువళ్లూరు: రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి కప్ పేరిట ప్రత్యేక పోటీలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే తిరువళ్లూరు క్రీడామైదానంలోనూ వా రం రోజుల నుంచి పోటీలను నిర్వహిస్తున్నారు. పోటీల్లో క్రికెట్, కోకో, పుట్‌బాల్, వాలీబాల్, కబడ్డీ, కర్రసాము, టేబుల్ టెన్నిస్, యోగా, స్విమ్మింగ్, రన్నింగ్, లాంగ్‌జంప్‌లో క్రీడాకారులు పోటీ పడుతున్నారు. కాగా పోటీల్లో పాల్గోనడానికి ముందగానే ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వుంది. ఈ నేపద్యంలో తిరువళ్లూరు జిల్లా కొరట్టూరు, మధురవాయల్, అంబత్తూరు తదితర మూడు ప్రాంతాలకు చెందిన విద్యార్దులు పోటీల్లో పాల్గోనడానికి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అనంతరం వీరు పోటీల్లో పాల్గొనడానికి మంగళవారం తిరువళ్లూరు లోని క్రీడామైధానానికి వచ్చారు. అయితే విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో చెక్‌చేయగా వీరికి చైన్నెలోని మైదానంలో పాల్గోడానికి అనుమతి ఇచ్చారు. ఈ వి షయాన్ని గుర్తించని విద్యార్దులు తిరువళ్లూరుకు రావడంతో వారికి అను మతి నిరాకరించారు. ఇక చేసేదే మి లేకుండా విద్యా ర్థులు నిరాశతో వెనుదిరిగారు.


