న్యూస్‌రీల్
కీలక పార్టీల అభ్యర్థుల ప్రకటనతో సందడి
కసరత్తుల్లో ఎన్‌టీకే
డీఎంకేలో రంగంలోకి ఇన్‌చార్జ్‌లు
100 శాతం గెలుపు తమదేనని మంత్రి ధీమా
డీఏసీ నుంచి
బాల్‌మండైసా ఆవిష్కరణ
సాక్షి, చైన్నె : డీఏసీ డెవలపర్స్ నేతృత్వంలో పోరూర్–పూందమల్లి మార్గంలో బాల్‌మండైసా పేరిట గృహ ప్రాజెక్టును ఆవిష్కరించారు. స్థానికంగా జరిగిన కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు శుక్రవారం ఈ ప్రాజెక్ట్ లోగోను ఆవిష్కరించారు. ఇందులో డీఏసీ డెవలపర్స్ వ్యవస్థాపకుల సతీష్ కుమార్ సంతానం, సీఈఓ జోహో, సహ వ్యవస్థాపకులు కుమార్ వేంబు, ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్ హరి విఘ్నేష్ ఆర్, రీజనల్ సేల్స్ మేనేజర్ మజునాథ్ సెల్వమణి తదితరులు పాల్గొన్నారు. మెట్రో స్టేషన్‌కు కూత వేటు దూరంలో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. చైన్నెలోని ప్రధాన ప్రాంతాలకు సులభమైన రవాణా సౌకర్యంతో పాటు, భవిష్యత్తులో మంచి పెట్టుబడి అదించే విధంగా తీర్చిదిద్దుతున్నారు.
సాక్షి, చైన్నె: తమిళనాడులో ఉప ఎన్నికల సమరం మొదలైంది. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. మధురాంతకంలో డీఎంకే అభ్యర్థిగా పరంధామన్, అన్నాడీఎంకే అభ్యర్థిగా కనిత సంపత్, టీవీకే అభ్యర్థిగా మరగతం కుమర వేల్ పోటీలో ఉన్నారు. ఇద్దరు నారీమణుల మధ్య పోటీలో ఉన్న డీఎంకే పరంధామన్ ఓట్ల వేటలో ముందుకు దూసుకెళ్తున్నారు. ఆయన గెలుపే లక్ష్యంగా డీఎంకే సైతం ఇన్‌చార్జ్‌లను రంగంలోకి దించింది. వీరిలో అన్బరసన్, సుందర్ ఉన్నారు. అన్నాడీఎంకే అభ్యర్థిగా కనిత సంపత్ పోటీలో ఉన్నారు. స్థానిక బలం తనకే అన్న ధీమాతో ఆమె ఉరకలు తీస్తున్నారు. నియోజకవర్గంలో తమ కూటమిలోని పీఎంకేకు సైతం బలం అధికంగా ఉండడంతో గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేగా పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో టీవీకే అభ్యర్థిగా మరగతం కుమర వేల్ పోటీ చేస్తున్నారు. సీఎం విజయ్ చరిస్మా, తన వ్యక్తిగత బలం కలిసి వస్తుందన్న ధీమాతో ఆయన ప్రచారం చేస్తున్నారు. తిరుప్పూర్ జిల్లా ధారాపురంలో డీఎంకే అభ్యర్థిగా న్యాయవాది సుకన్య పోటీలో ఉన్నారు. ఆమె తన దైన వాక్ చాతుర్యంతో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆమె గెలుపే లక్ష్యంగా డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి స్వామినాథన్, తిరుప్పూర్ తూర్పు జిల్లా కార్యదర్శి పద్మనాభన్ ఇన్‌చార్జ్‌లుగా రంగంలోకి దిగారు. అన్నాడీఎంకే అభ్యర్థిగా భానుమతి పోటీలో ఉన్నప్పటికీ తనకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే, టీవీకే అభ్యర్థి సత్యభామా ధీమాతో ఉన్నారు. ఇక్కడ మూడు పార్టీలకు చెందిన ముగ్గురు నారీ మణుల మధ్య సమరం ఆసక్తికరంగా మారింది. టీవీకే అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యంగా మంత్రులు ఆనంద్, అరుణ్ రాజ్, నిర్మల్‌కుమార్ తదితరులు వ్యూహాలకు పదును పెడుతున్నారు. మంత్రి సెంగోట్టయ్యన్ మీడియాతో మాట్లాడుతూ 100 శాతం గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేయడం గమనార్హం. తాము సైతం రేసులో ఉన్నామని నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ ప్రకటించారు. ఆయన ఇంకా అభ్యర్థుల ఎంపికలోనే కుస్తీ పడుతున్నారు.
నిఘా కట్టుదిట్టం
మహా మహంకు కోటి మంది భక్తులు
విమానాశ్రయంలో సీఎం విజయ్ అభివాదం
సోలమన్ పాపయ్య
మధురాంతకం, ధారాపురంలో ఉప ఎన్నికల సమరం వేడెక్కింది. ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. దీంతో వారు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. నామ్ తమిళర్‌కట్చి నేత సీమాన్ అభ్యర్థుల ఎంపిక కసరత్తులోనే ఉన్నారు. ఇక డీఎంకే ఇన్‌చార్జ్‌లను రంగంలోకి దించింది. చెంగల్పట్టు జిల్లా మధురాంతకం (ఎస్సీ), తిరుప్పూర్ జిల్లా ధారాపురం (ఎస్సీ) శాసనసభ నియోజకవర్గాల
ఉపఎన్నికలను అధికార టీవీకే, ప్రతిపక్షాలైన డీఎంకే, అన్నాడీఎంకేలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపుతో తమ హవాను చాటుకునే దిశగా సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే నాయకులు వ్యూహాలకు పదును పెట్టే పనిలో పడ్డారు. సిట్టింగ్ సీటును తమ గుప్పెట్లోకి
తెచ్చుకునేందుకు అన్నాడీఎంకే, గెలుపుతో తమ బలం తగ్గలేదని చాటే దిశగా డీఎంకే దూకుడుగా ముందుకెళ్తున్నాయి
ఉప ఎన్నికల నగారా మోగడంతో ఈ రెండు నియోజకవర్గాలలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్ ఆదేశాలతో చెంగల్పట్టు, తిరుప్పూర్ జిల్లాల కలెక్టర్లు ఎన్నికల ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. ఆ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. సరిహద్దుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు చేస్తున్నారు.


