చైన్నె ఓపెన్‌ 2026 టైటిల్‌ విజేత విరాజ్‌ | - | Sakshi
Sakshi News home page

చైన్నె ఓపెన్‌ 2026 టైటిల్‌ విజేత విరాజ్‌

Sep 12 2026 12:36 AM | Updated on Sep 12 2026 12:36 AM

సాక్షి, చైన్నె : చైన్నెలోని టీఎన్‌జీఎఫ్‌ కోస్మో గోల్ఫ్‌ కోర్స్‌లో నిర్వహించిన రూ. కోటి ప్రైజ్‌ మనీ కలిగిన చైన్నె ఓపెన్‌ 2026 టోర్నమెంట్‌ను కోల్‌కతా గోల్ఫర్‌ విరాజ్‌ మడప్ప (28) కై వసం చేసుకున్నారు. చివరి రౌండ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ఆయన మూడు షాట్ల వెనుకంజను అధిగమించి ఒక స్ట్రోక్‌ తేడాతో తన నాలుగో ప్రొఫెషనల్‌ టైటిల్‌ను సాధించారు. చైన్నె పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నమెంట్‌లో విరాజ్‌ మడప్ప (72–67–63–64) చివరి రోజు ఎలాంటి పొరబాటు చేయకుండా అద్భుతమైన 8–అండర్‌ 64 స్కోరుతో చెలరేగారు. మొత్తంగా 22–అండర్‌ 266 స్కోరుతో విజేతగా నిలిచారు.

ప్రీమియం – ప్రైజ్‌ మనీ

ఓవర్‌నైట్‌ లీడర్‌ అజితేష్‌ సంధును వెనక్కి నెట్టిన మడప్ప ఈ విజయంతో రూ.15 లక్షల ప్రైజ్‌ మనీని గెలుచుకున్నారు. ఈ విజయంతో 2026 డీపీ వరల్డ్‌ పీజీటీఐ ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌లో 44వ స్థానం నుంచి 22వ స్థానానికి చేరుకున్నారు. దీనిద్వారా ఈ సీజన్‌లో ఆయన మొత్తం రూ.23,90,042 దక్కించుకన్నారు. అలాగే ప్రతిష్టాత్మక డీపీ వరల్డ్‌ ఇండియా ఛాంపియన్‌ షిప్‌నకు అర్హత సాధించారు. 2018లో ఏషియన్‌ టూర్‌లో గెలుపొందిన అతిపిన్న వయస్కుడిగా మడప్ప రికార్డ్‌ సృష్టించారు. తాజాగా ఈ చైన్నె ఓపెన్‌ విజయంతో మరోసారి తన సత్తా చాటుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement